ఆదిపురుష్ సెన్సార్ కంప్లీట్.. ఇన్సైడ్ టాక్ అదిరిపోయింది

ఆదిపురుష్ సెన్సార్ కంప్లీట్.. ఇన్సైడ్ టాక్ అదిరిపోయింది

ప్రభాస్(Prabhas) రాముడిగా చేస్తున్న ఆదిపురుష్(Adipurush) మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. జూన్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో వారం రోజుల ముందే సెన్సార్ బోర్డు రిపోర్ట్ ఇచ్చింది. ఈ సినిమాకు సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికెట్ ను జారీచేసింది. సినిమా నిడివి కూడా 2 గంటల 59 నిమిషాలు ఉండేలా లాక్ చేశారు మేకర్స్. దాదాపు మూడుగంటల నిడివితో రానున్న ఈ సినిమా ఆడియన్స్ పై చెరగని ముద్ర వేయనుందని సెన్సార్ మెంబర్స్ నుండి వినిపిస్తున్న మాట. 

మనందరికీ తెలిసిన కథే అయినప్పటికి.. ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుందట. ఇక రాముడిగా ప్రభాస్ నటన సినిమాని నిలబెట్టేలా ఉందట. సీతగా కృతి నటన కంటనీరు పెటించేలా ఉండనుందట. మొత్తంగా ఈ సినిమా అటు టీమ్ కు, ఇటు ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుందట. మరి ఆ అనుభూతిని మనం కూడా పొందాలంటే జూన్ 16 వరకు ఆగాల్సిందే.    

©️ VIL Media Pvt Ltd.

2023-06-08T11:19:01Z dg43tfdfdgfd