ఆన్సర్ షీట్‌ని జైశ్రీరామ్‌తో నింపేశారు, పాస్ అయ్యారు - కరెక్ట్ చేసిన ప్రొఫెసర్‌లు సస్పెండ్

UP Students Answer Sheet: యూపీలో పూర్వాంచల్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్‌లు ఆన్సర్ షీట్‌లో జైశ్రీరామ్ అని రాసిన విద్యార్థులను పాస్ చేశారు. ఆన్సర్స్‌కి బదులుగా జైశ్రీరామ్ అని రాస్తే వాటిని కొట్టేయాల్సింది పోయి కరెక్ట్ చేసి పాస్ చేయడంపై యాజమాన్యం ఫైర్ అయింది. ఆ ఇద్దరు ప్రొఫెసర్‌లనూ సస్పెండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఈ నిర్ణయం తీసుకుంది. D Pharma స్టూడెంట్స్‌ ఆన్సర్ షీట్‌లో ఇలా జైశ్రీరామ్‌తో పాటు కొందరి క్రికెటర్‌ల పేర్లు కూడా రాశారు. ఎగ్జామ్‌లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలియక ఇలా చేశారు. అయితే...కొందరు విద్యార్థులు వీళ్లు పాస్‌ అవడంపై అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే RTI ఫైల్ చేశారు. ఆ ప్రొఫెసర్‌లు లంచం తీసుకుని పాస్ చేశారని ఆరోపించారు. పాస్ అయిన ఇద్దరి విద్యార్థుల ఆన్సర్ షీట్స్‌ని రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఓ అఫిడవిట్‌ని కూడా దాఖలు చేశారు. ఇదంతా గతేడాది డిసెంబర్‌లో జరిగింది.

అప్పుడే ఈ ఘటనపై గవర్నర్ కార్యాలయం సీరియస్ అయింది. వెంటనే విచారణకు ఆదేశించింది. అటు యూనివర్సిటీ యాజమాన్యం కూడా ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. ఆ ఇద్దరి పేపర్స్‌ని రీవాల్యుయేషన్ చేయగా వాళ్లకు వేసిన మార్క్‌లలో భారీ తేడా కనిపించింది. ఏమీ రాయని వ్యక్తికి 52 మార్కులు వేసి పాస్ చేశారు. మరో విద్యార్థికి 34 మార్క్‌లు వేసి పాస్ చేశారు. అందులో ఏముందని గమనిస్తే జైశ్రీరామ్ నినాదాలు తప్ప ఏమీ కనిపించలేదు. IPS ఆఫీసర్ ఒకరు ఈ ఆన్సర్ షీట్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. 

Also Read: Fact Check: I.N.D.I.A కూటమికి అనుకూలంగా ప్రధాని మోదీ ట్వీట్? అసలు నిజమిదే

2024-04-27T11:31:42Z dg43tfdfdgfd