ఆమెకు అరుదైన అవకాశం.. నాడు చదివిన కళాశాలకే నేడు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు..!!

నాడు ఆమె ఆ కళాశాలలో విద్యార్థిని. అందరి మాదిరిగానే కళాశాలకు వచ్చి మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు పూర్తి చేసింది. డిస్టింక్షిన్ సాధించింది. కానీ ఆమె కూడా ఉహించని రీతిలో ఈ రోజు చదివిన కళాశాలలోనే ప్రిన్సిపాల్ గా పనిచేసే అవకాశాన్ని సొంతం చేసుకుంది. నాడు తనకు బోధించిన అధ్యాపకుల ప్రేరణతో ఉన్నత చదువులు చదివి గౌరవప్రదమైన ఉద్యోగం చేపట్టాలని నిర్ణయించుకుంది. పెళ్ళి అయ్యింది కదా ఇంకేం చదువు అని అక్కడికే ఆగి పోలేదు. కష్టపడి చదివి తొలుత ఉపాధ్యాయురాలిగా, ఆ తర్వాత డిగ్రీ కళాశాల అధ్యాపకురాలిగా ఉద్యోగాలను చేపట్టింది. స్వీయ ప్రతిభతో ఎదిగి చదివిన కళాశాలకే ప్రిన్సిపాల్ సేవలు అందిస్తున్న ఆమె మరెవరో కాదు. ఆమె ఆదిలాబాద్ పట్టణానికి చెందిన డా. జలగం అనిత.

ఆదిలాబాద్ పట్టణానికి చెందిన డా. జలగం అనిత 1993 నుండి 1996 వరకు పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బి.కాం డిగ్రీ పూర్తి చేశారు. డిస్టింక్షన్ లో ఉత్తీర్ణత సాధించి అందరిని మెప్పును పొందారు. తనకు బోధించిన గురువులను ఆదర్శంగా తీసుకొని ఉన్నత విద్యను అభ్యసించింది. 1996 నుండి 1998 వరకు హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కళాశాలలో చేరి ఎం.కాం పూర్తి చేసింది. అనంతరం 1998 నుండి 2000 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. సైకాలజీ పూర్తి చేసింది. అదే యేడాది ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ గా చేరి ఐదు సంవత్సరాల పాటు పనిచేసింది. 2005లో ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఎం.ఏ ఇంగ్లీష్ పూర్తి చేశారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి 2009లో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించి ఇచ్చోడ మండలం బోరిగాంలో పనిచేశారు.

శుభవార్త.. రైతుల అకౌంట్లలోకి మళ్లీ డబ్బులు..

అక్కడిగే ఆగిపోకుండా ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి 2012 అక్టోబర్ లో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాన్ని సాధించి ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కామర్స్ లెక్చరర్ గా పనిచేశారు. యేడాదిలోపే అంటే 2013 జనవరిలో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. కామర్స్ విభాగంలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించి ఈ ఉద్యోగాన్ని చేపట్టారు. ఆదిలాబాద్ లోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో కామర్స్ లెక్చరర్ గా విధులను నిర్వహించిన అనిత 2019లో మహిళా డిగ్రీ కళాశాలకు బదిలి అయ్యారు.

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అదిరే గుడ్ న్యూస్.. ఇక ఉచితంగానే..

2021లో ఇదే కళాశాలకు ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టారు. తాను కూడా ఊహించని రీతిలో చదివిన కళాశాలకు ప్రిన్సిపాల్ అయిన అనిత కళాశాల అభివృద్దికి, విద్యార్థులకు మౌలిక సదుపాయలను కల్పించడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. తోటి అధ్యాపకుల సహకారం, ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో కళాశాలకు అన్ని హంగులను అద్ది ప్రైవేటు కళాశాలకు ధీటుగా ఈ ప్రభుత్వ కళాశాలను తీర్చిదిద్దారు. స్వీయ ప్రతిభ, స్వయంకృషితో అంచలంచెలుగా ఎదిగి, నేడు తాను చదివిన కళాశాలకు ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టి కళాశాల అభివృద్దితోపాటు విద్యార్థుల వికాసం కోసం నిస్వార్ధంగా కృషి చేస్తున్న అనితను అందరు అభినందిస్తున్నారు.

2024-04-25T10:47:17Z dg43tfdfdgfd