`ఆరంభం` మూవీ రివ్యూ, రేటింగ్‌

`కేరాఫ్‌ కంచరపాలం` చిత్రంతో ఆకట్టుకున్న మోహన్‌ భగత్‌ ఇప్పుడు `ఆరంభం` అనే డిఫరెంట్‌ కాన్సెప్ట్ చిత్రంతో వచ్చాడు. ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

కంటెంట్‌ ఉన్న చిత్రాలకు ఏ మాధ్యమంలోనైనా ఆదరణ దక్కుతుంది. అలాంటి కంటెంట్‌తోనే `ఆరంభం` అనే మూవీ వచ్చింది. `కేరాఫ్‌ కంచరపాలెం` చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మోహన్‌ భగత్‌ ఇందులో హీరోగా నటించాడు. అజయ్‌ నాగ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏవీటీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అభిషేక్‌ వీటీ నిర్మించారు. టీజర్‌, ట్రైలర్‌తో ఆకట్టుకుంది. ఏదో విషయం ఉందనే ఫీలింగ్‌ని కలిగించింది. మరి నిజంగానే సినిమాలో దమ్ముందా, ఆకట్టుకునే చిత్రమవుతుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

 

కథః

మిగిల్‌(మోహన్‌ భగత్‌) కి మర్డర్‌ కేసులో రెండున్నరేళ్లుగా కాలాఘటి జైల్లో ఉంటాడు. చివరికి అతనికి ఉరిశిక్ష పడుతుంది. ఉరిశిక్ష అమలు చేయడానికి ఒక్క రోజే ఉంటుంది. కట్‌ చేస్తే ఆ జైలు నుంచి మిగిల్ తప్పించుకుంటాడు. అయితే సెల్‌ తాళాలు వేసినవి వేసినట్టే ఉంటాయి, జైలుకి ఎలాంటి రంధ్రాలు లేవు, పారిపోయినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. పైగా జైల్లో పటిష్టమైన భద్రత ఉంటుంది. మరి జైలు సెల్‌ నుంచి మిగిల్‌ ఎలా తప్పించుకున్నాడనేది పెద్ద మిస్టరీ. ఇది పోలీస్‌ డిపార్ట్ మెంట్ కి పెద్ద టాస్క్ లా మారుతుంది. ఎలా తప్పించుకున్నాడు, ఎక్కడికి వెళ్లాడు అనేది తెలియదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ సస్పెన్స్ ని చేధించడానికి డిటెక్టివ్‌(రవీంద్ర విజయ్‌) రంగంలోకి దిగుతాడు. మిగిల్‌ ఉన్న సెల్‌లో ఓ బుక్ దొరుకుతుంది. అందులో మిగిల్‌ చిన్నప్పుడు పెరిగిన వివరాలు, తన గురువు (భూషణ్‌) చేస్తున్న డేజావు ప్రయోగాల గురించి ఉంటుంది. మరి మిగిల్‌ చిన్నప్పటి లైఫ్‌ ఏంటి? ఎలా పెరిగాడు, తన సర్‌ ఎవరు? ఆయన చేసే ప్రయోగాలేంటి? ఇంతకి మిగిల్‌ ఎలా తప్పించుకున్నాడు అనేది `ఆరంభం` సినిమా మిగిలిన కథ. 

 

విశ్లేషణః 

ఇటీవల కాలంలో వస్తున్న దర్శకులు టెక్నికల్‌ గా చాలా కంటెంట్‌తో వస్తున్నారు. పుస్తకాల ప్రభావం, ప్రపంచ సినిమాని చూస్తున్న తీరు నేపథ్యంలో కొత్త ఐడియాలతో వస్తున్నారు. సంచలనాలు సృష్టిస్తున్నారు. ఇటీవల వచ్చిన `గామి` ఆ కోవకి చెందినదే. అయితే హైలీ ఇంటలిజెంట్‌గా ఉండటం వల్ల సాధారణ ఆడియెన్స్ కి అర్థం కావడం కష్టం. జనం ఆదరణ పొందడం కష్టమవుతుంది. దాన్ని లెవల్ తగ్గించి తీస్తే అద్భుతాలు చేయోచ్చు. లేదంటే ప్రశంసలకే పరిమితమవుతుంది. తాజాగా వచ్చిన `ఆరంభం` సినిమా విషయంలోనూ అదే జరుగుతుంది. ఇది రెగ్యూలర్‌ చిత్రాలకు భిన్నమైనది. ఇందులో సైన్స్ ఎలిమెంట్లు ఉన్నాయి. ఆత్మల అంశాలున్నాయి. అయితే వాటిని ఎగ్జిక్యూట్‌ చేయడం, ఆడియెన్స్ కి అర్థమయ్యేలా చెప్పడమే పెద్ద టాస్క్. ఆ విసయంలో `ఆరంభం` మేకర్స్ కొంత వరకు బాగానే సక్సెస్‌ అయ్యారు. అదే సమయంలో కొంత కన్‌ఫ్యూజన్‌ కూడా ఉంది. చిత్ర దర్శకుడు అజయ్‌ నాగు వి `విందు భోజనం`, `ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌` వంటి అవార్డు విన్నింగ్‌ మూవీస్‌కి కెమెరామెన్‌గా పనిచేశారు. ఇప్పుడు `ఆరంభం`తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ మూవీని కన్నడ నవల ఆధారంగా తెరకెక్కించాడు. దీన్ని రెగ్యూలర్‌ సినిమాలా కాకుండా అధ్యాయాలుగా, పార్ట్ లుగా తెరకెక్కించడం విశేషం.

అయితే ఈ మూవీలో మొదటి భాగంలోనే మొదటి ఆధ్యాయం ముగింపు అంటూ కొత్తగా ప్రజెంట్‌ చేసి ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేశారు. ఏం జరగబోతుంది, ఏం చూపించబోతున్నారనే క్యూరియాసిటీ రేకెత్తించారు. జైల్‌ నుంచి మిగిల్‌ ఎలా తప్పించుకున్నాడనే సస్పెన్స్ సినిమా మొదటి భాగం మొత్తం రన్ అవుతుంది. ఈ క్రమంలో వచ్చే సీన్లు ఉత్కంఠకి గురి చేస్తాయి. అదే సమయంలో కొంత కన్‌ ఫ్యూజన్‌ని క్రియేట్‌ చేస్తాయి. మిగిల్‌ చిన్ననాటి లైఫ్‌, అమ్మ సెంటిమెంట్‌ హృదయాన్ని హత్తుకుంటాయి. సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయి.  రెండో భాగంలో వచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోయేలా ఉంటుంది. వామ్మో ఇలా కూడా జరుగుతుందా? అనే ఆశ్చర్యం ఆడియెన్స్ లో కలుగుతుంది. మిగిల్‌, సుబ్రమణ్యరావు కలిసి ఓ ప్రాజెక్ట్ కోసం పనిచేయడం ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన అంశాలు ఆలోచింప చేస్తాయి, అర్థంకాక ఇబ్బంది కూడా కలుగుతాయి. సినిమాలో చాలా టెక్నికల్‌,సైంటిఫిక్‌ అంశాలుంటాయి. అవి ఆసక్తికరంగా ఎంగేజింగ్‌గా సాగుతాయి. అయితే సినిమా స్లోగా సాగడం మైనస్‌గా చెప్పొచ్చు. థ్రిల్లర్‌ యాంగిల్‌లో వెళ్తుంది. ట్విస్ట్ లు ఎక్కువగా ఉంటే ఆ థ్రిల్‌ ఆడియెన్స్ ఫీల్‌ అయ్యేవాళ్లు. దీనికితోడు స్క్రీన్‌ప్లేని మరింత ఈజీ చేస్తే ఆడియెన్స్ కి మరింతగా ఆకట్టుకునేలా ఉండేది. 

 నటీనటులుః 

`కేరాఫ్‌ కంచరపాలం` చిత్రంతో మెప్పించిన మోహన్‌ భగత్‌ ఇందులో పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఎలాంటి ఇమేజ్‌లకు పోకుండా కేవలం పాత్రగానే కనిపించి నటనతో మెప్పించాడు. సాధారణ మనుషుల్లో ఒకరిగా కనిపించి మెప్పించాడు. డిఫరెంట్‌ షేడ్స్ లో, డిఫరెంట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో, మంచి నటనతో ఆకట్టుకున్నాడు. సుప్రిత సత్యనారాయణ్ ఫిమేల్ లీడ్ లో తన పాత్రలో మెప్పించింది. `మంగళవారం`, `కీడాకోలా` ఫేమ్ రవీంద్రవిజయ్‌ డిటెక్టివ్ పాత్రలో ఒదిగిపోయాడు. తల్లి పాత్రలో సురభి ప్రభావతి మెప్పించింది. సైంటిస్ట్ గా భూషణ్ చాలా బాగా నటించారు. లక్ష్మణ్ మీసాల, రవీంద్ర విజయ్ వంటి వారు ఇతర పాత్రల్లో ఆకట్టుకున్నారు. 

టెక్నీషియన్లుః

ఈ సినిమాకు దేవ్‌దీప్‌ గాంధీ కెమెరా వర్క్ బాగుంది. ఓ కొత్త ఫీల్‌ని తెస్తుంది. కొండలు, గ్రీనరీని చాలా అందంగా చూపించాడు. సింజిత్‌ యెర్రమిల్లి సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదనిపించినా, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం అదిరిపోయింది. అదే సినిమాకి పెద్ద హైలైట్‌, అసెట్‌ అని చెప్పాలి. ఆర్ట్ వర్క్ అదిరిపోయింది. దర్శకుడు అజయ్‌ నాగు ఎంచుకున్న కథ బాగుంది. కానీ స్క్రీన్‌ ప్లే పరంగా కేర్‌ తీసుకోవాల్సింది. ఆ విషయంలో మరింత వర్క్ చేసి ఉంటే సినిమా ఫలితం మరో స్థాయిలో ఉండేది.  

ఫైనల్‌గాః `ఆరంభం` స్క్రీన్‌ ప్లేలో ఓ మంచి ప్రయత్నం. 

రేటింగ్‌ః 2.75

2024-05-10T12:52:48Z dg43tfdfdgfd