ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ .. ఫీజు చెల్లింపునకు ఇయ్యాలే ఆఖరు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపునకు గురువారంతో గడువు ముగుస్తుందని హైదరాబాద్జిల్లా ఇంటర్విద్యాధికారి దాసరి వడ్డెన్న తెలిపారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ఇయర్లో ఫెయిల్ అయిన స్టూడెంట్లు, ఇంప్రూవ్మెంట్ రాసే స్టూడెంట్లు కాలేజీల్లో ఫీజులు చెల్లించాలని సూచించారు. స్టూడెంట్ల నుంచి ఫీజులు తీసుకుని, ఏదైనా కారణంతో ఎగ్జామ్స్ కు అప్లయ్ చేయకపోతే ఆయా కాలేజీలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వడ్డెన్న హెచ్చరించారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-02T02:59:34Z dg43tfdfdgfd