ఇండియన్ 2 రిలీజ్ ట్విస్ట్

ఇండియన్ 2 రిలీజ్ ట్విస్ట్

కమల్ హాసన్, శంకర్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భారతీయుడు 2’.  ఇరవై ఎనిమిదేళ్ల  తర్వాత  సీక్వెల్‌‌‌‌గా వస్తోన్న ఈ చిత్రంపై  భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా విడుదలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు టీమ్ మరో ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. జూన్‌‌‌‌లో వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా మూవీ రిలీజ్ అని అనౌన్స్ చేసిన టీమ్.. మరో నెల వాయిదా వేసే ఆలోచనలో ఉందట. ప్రభాస్ నటించిన ‘కల్కి’ చిత్రం జూన్ 27న విడుదలవుతుండటంతో తమ చిత్రాన్ని జులైకి షిఫ్ట్ చేసే ప్లాన్ చేస్తున్నారట. 

అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కొంత పెండింగ్ ఉండటంతో వాయిదా వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఫైనల్‌‌‌‌గా  జులై 18న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.  ఈ కొత్త రిలీజ్ డేట్‌‌‌‌ను త్వరలోనే అఫీషియల్‌‌‌‌గా అనౌన్స్ చేయనున్నారట.  ఇందులో కమల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే స్వాతంత్య్ర స‌‌‌‌మ‌‌‌‌ర‌‌‌‌యోధుడు సేనాప‌‌‌‌తిగా  ప‌‌‌‌వ‌‌‌‌ర్‌‌‌‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. కాజల్, రకుల్ ప్రీత్‌‌‌‌సింగ్ హీరోయిన్స్‌‌‌‌. సిద్ధార్థ్, ఎస్‌‌‌‌జే సూర్య, బాబీ సింహా, మనోబాల, బ్రహ్మానందం, సముద్రఖని  ఇతర పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్  సంగీతం అందిస్తున్నాడు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T04:00:16Z dg43tfdfdgfd