ఇక్కడ బాయ్‌ఫ్రెండ్‌లను అద్దెకు దొరుకుతారు.. ఓ భారతీయ యువతి ఒకరిని బుక్ చేసుకుంది.!

ప్రస్తుత రోజుల్లో యువత ఎంత ఫాస్ట్ గా ఉందో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు.. చాలా మంది యువత వివాహం అన్న కాన్సెఫ్ట్ ని నమ్మడం మానేశారు. ఈ జమానాలో స్త్రీపురుషుల సంబంధాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. అమ్మాయిలు, అబ్బాయిలు తమ రిలేషన్ షిప్ లో ఒకరినొకరు అర్ధం చేసుకునేందుకు డేటింగ్ చేసుకోవడం కామన్ అయిపోయింది. ఇక ప్రపంచంలోని కొన్ని దేశాల్లో డేటింగ్ కంటే అప్‌డేట్ వెర్షన్ లు ప్రారంభ మయ్యాయి అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఆ దేశంలో బాయ్‌ఫ్రెండ్స్ మరియు గర్ల్‌ఫ్రెండ్స్ అద్దెకు అందుబాటులో ఉంటారు. ఒంటరిగా ఉండే వ్యక్తులు డబ్బు చెల్లించి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. ఇంతకీ ఈ బంపర్ ఆఫర్ ఎక్కడ అని ఆలోచిస్తున్నారా. ఎక్కడో కాదు జపాన్ లో అద్దెకు భాయ్ ఫ్రెండ్స్ దొరుకుతారంట. తాజాగా ఓ భారతీయ యువతి కూడా అదే పని చేసింది.. కిరాయికి ప్రియుడిని బుక్ చేసుకుంది.. ఈ విషయాన్ని వీడియోతీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆ అబ్బాయి గురించి వివరించింది.

ఇదీ చదవండి : పవిత్రంగా మారిన సంతాప దినం.. గుడ్ ఫ్రైడేకి ఏం చేస్తారో తెలుసా

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ కృతి జపాన్‌లోని టోక్యోలో నివసిస్తున్న ఓ భాయతీయ యువతి. ఆమె దుస్తులు, కేశాలంకరణ మరియు లుక్ పూర్తిగా జపనీస్ అమ్మాయిలను పోలి ఉంటాయి. ఆమెని ఎవరైనా చూస్తే జపనీస్ అని అనుకుంటారు. అయితే ఆమె అనర్గళంగా హిందీ మాట్లాడటం చూసి.. భారతీయ యువతి అని స్పష్టమవుతుంది. తాజాగా ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌కు తన ఫాలోవర్లను పరిచయం చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఆ అబ్బాయికి, ఈ అమ్మాకి మధ్య ఉన్న సంబంధం తాత్కాలిక మేనంట.. అంటే ఆ యువకుడిని కేవలం కిరాయికి తీసుకుంది.

బాయ్‌ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకున్న అమ్మాయి.

జపాన్‌లో అద్దెకు తీసుకున్న తన ప్రియుడిని కలవబోతున్నట్లు కృతి వీడియోలో తెలిపింది. తర్వాత కెమెరాను అబ్బాయి వైపు తిప్పింది. బాయ్‌ఫ్రెండ్ మరియు గర్ల్‌ఫ్రెండ్‌ను జపాన్‌లో అద్దెకు తీసుకోవచ్చని అమ్మాయి చెప్పింది. బాయ్‌ఫ్రెండ్‌ని అద్దెకు తీసుకున్నందుకు కృతి నవ్వుతోంది. ఇది చాలా వింతగా అనిపించినా నిజం. అంతే కాదు కృతి ఆ వ్యక్తికి హిందీ కూడా నేర్పించింది. కృతి షేర్ చేసిన వీడియో 1 కోటి మందికి పైగా వీక్షించారు. కొందరు ఈ వీడియోకి కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇండియాలో కూడా గర్ల్‌ఫ్రెండ్‌ని అద్దెకు తీసుకుంటే బాగుండేదని సరదాగా అంటున్నారు. ఇక మరికొందరైతే తనకు ప్రపోజ్ చేసి ఉంటే ఫ్రీగా ఒప్పుకునేవాడినని అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక మరికొందరైతే అతని ధర ఎంత అని అడుగుతున్నారు.

2024-03-29T10:46:11Z dg43tfdfdgfd