ఇళయరాజా గొప్పవారేమీ కాదు..మద్రాస్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజాకు హైకోర్టులో చుక్కెదురయ్యింది. అంతే కాదు ఆయనపై సంచలన వ్యాఖ్యలు చూడా చేశారు జస్టీస్. ఇంతకీ వారు ఏమన్నారంటే..? 

 

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంగీత తరంగం ఇళయరాజా. దాదాపు మూడు దశాబ్ధాలుగా  అద్భుతమైన సినీ  సంగీతాన్ని అందిస్తూ.. శ్రోతల మనసు దోచుకున్నారు ఇళయరాజ. ప్రేమ, విరహ, భక్తి, మెలోడీ, ఇలాఆయన చేసిన ప్రతీ పాట సంగీత ప్రియులను అలరించింది.  ఆయన పాటల వల్లే సినిమాలు విజయవంతమయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు పలు భాషలలో వెయ్యికిపైగా సినిమాలకు సంగీతం అందించారు ఇళయరాజ. ఆయన ప్రతిభకు మెచ్చి ఎన్నో అవార్ధులు రివార్డ్ లు కూడా అందాయి. అంతే కాదు  ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా కూడా  కొనసాగుతున్నారు. ఇళయరాజ. అయితే ఎంత మంచి సంగీత దర్శకుడో.. అంత వివాదాల్లో కూడా ఉన్నారు రాజా.  ఆయనపై గతంలో కూడా ఎన్నో  వివాదాలు ఉన్నాయి.  

 

బాలకృష్ణకు భారీగా ఆస్తులతో పాటు అప్పులు, మోక్షజ్ఞ కు ఎంత ఆస్తి ఉందంటే...?

తాజాగా మద్రాసు హైకోర్ట్ ఇళయరాజాపై సంచలన కామెంట్లు చేసింది. ఇళయరాజ  గొప్పవారే కానీ.. అందరికంటే గొప్పవారేం కాదని మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి అన్నారు. రీసెంట్ గా ఇళయరాజా పాటలను వాడుకునే ఒప్పందం గడువు పూర్తి అయ్యిందని ఏకో రికార్డింగ్‌ తదితర సంస్థలపై ఇళయరాజా కాపీ హక్కులను కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

హీరో విజయ్ కి ప్రమాదం, గాయాలతో ఓటు వేయడానికి వచ్చిన దళపతి,

దీంతో ఆ సంస్థలు కూడా చెన్నై హైకోర్టు రిట్‌ పిటిషన్ వేశారు. ఈ కేసును విచారించిన  కోర్టు ఇళయరాజా పాటను ఉపయోగించుకునే హక్కు ఆ రికార్డింగ్‌ సంస్థలకు ఉందని తీర్పు చెప్పింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఇళయరాజా తరఫున మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 10వ తేదీన న్యాయమూర్తులు ఆర్‌.మహాదేవన్, మహ్మద్‌ షఫీక్‌ సమక్షంలో ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. 

మహేష్ బాబు బ్లాక్ లో సినిమా టికెట్లు కొన్నారా..? అది కూడా ఆ హీరో సినిమా కోసం..?

ఈ సందర్భంగా ఇళయరాజా తరఫు న్యాయవాది  మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు ఇళయరాజా అందరికంటే గొప్పవారని అన్నారు. దాంతో వెంటనే కలగచేసుకున్న న్యాయమూర్తి ఆర్‌.మహాదేవన్‌ ఈ విధంగా అన్నారు. సంగీత త్రిమూర్తులుగా ఉన్న సంగీత శిఖరాలు  ముత్తుస్వామి దీక్షితర్, త్యాగరాజర్, శ్యామశాస్త్రి అందరి కంటే గొప్పవారు. ఇళయరాజా అంతకంటే గొప్పవారేం కాదు. మీ వాదనను మేము అంగీకరించలేము' అని అన్నారు. 

దాంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇక ఈకేసు విచారణను కూడా ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. గతంలో కూడా ఎన్నో సార్లు కోర్టు మెట్లు ఎక్కారు ఇళయరాజా తన ప్రాణ స్నేహితుడు.. స్టార్ సింగర్..దివంగత ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం మీద కూడా ఇలాంటికేసు వేశారు రాజ. అంతే కాదు ఎల్వీప్రసాద్ స్టూడియోలో తన ఆఫీస్ గురించి కూడా కోర్టుకెక్కారు. కాని ఈకేసులో ఆయనకు ఎదురుదెబ్బలుతప్పలేదు. ఇలా ప్రతీసారి ఏదో ఒక రకంగా వివాదాల్లో నిలుస్తున్నారు ఇళయరాజ.  

2024-04-20T06:46:01Z dg43tfdfdgfd