ఈ గోలిసోడా తాగితే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు రావాల్సిందే.. ఆ మధురమే వేరు..

చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుకు తెచ్చే కూల్డ్రింక్స్ మీకు గుర్తున్నాయా...! ముఖ్యంగా ఈ వేసవిలో దాహర్తిని తీర్చే ఆ గోలిసోడా టేస్ట్ మీకు గుర్తుందా...! కనుమరుగైన గోలిసోడా మళ్ళీ దొరికితే ఎలా ఉంటుంది... 1990లో పుట్టిన కిడ్స్ ఫేవరెట్ డ్రింక్ గోలిసోడా పేరు వింటే వెంటనే వెళ్లి తాగేయాలి అనిపిస్తుంది కదూ... నిజంగా అప్పట్లో గోలిసోడా పేరుతో లభించే కార్బొనేటెడ్‌ సాఫ్ట్ డ్రింక్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు రుచిలో, శుచిలోనూ గోలి సోడాకు ఉండే ప్రత్యేకతే వేరు.

అసలే ఎండాకాలం బయట ఎండలు మండిపోతున్నాయి. అలా అని ఇంట్లో ఉంటే మాత్రం నిప్పుల కుంపటిలో కూర్చునట్లే. ప్రస్తుతం ఈ వేసవిలో చల్లని పానీయాలకు డిమాండ్ బాగా పెరిగిపోతుంది. కొంతమంది ఆరోగ్యంపై శ్రద్ధతో మట్టి కుండలో నీళ్లు తాగితే మరికొంత మంది బయట ఎండలు తట్టుకోలేక గొంతు చల్ల పరుచుకోవడానికి ఫ్రిడ్జ్ నీళ్లు తాగాల్సిన పరిస్థితి. మరోవైపు బయట తిరిగేవాళ్ళు మాత్రం కచ్చితంగాగంటకొకసారి ఏదో ఒక కూల్డ్రింక్స్ తాగాల్సిందే.

Summer Special: సమ్మర్ స్పెషల్.. 3 గంటల పాటు ఇక్కడ విచ్చలవిడిగా..

అన్నట్టు కూల్డ్రింక్స్ అంటే మొదటగా 19'Sకిడ్స్ కి గుర్తొచ్చేది గోలిసోడా. ఈ ఎండాకాలంలో గోలిసోడా అంటే ప్రతి ఒక్కరికి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి. ప్రస్తుతం గోలిసోడాలు అయితే కనుమరుగయ్యాయి. కానీ అప్పట్లో గోలిసోడాకు ఉండే క్రేజ్ వేరే లెవెల్. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో గోలిసోడా పేరు చెప్పగానే సోడా… అదీ గోలీసోడా ఇప్పటికీ ఉందా ఇంకా తాగుతున్నారా. ఆనాటి సంగతి అరె, అసలు అదొకటి ఉండేదన్నదే మర్చిపోయామే అని అంటారు చాలామంది. రకరకాల సాఫ్ట్‌డ్రింకుల పుణ్యమా అని సోడా దాదాపుగా సైడయిపోయిన సంగతి వాస్తవమే కానీ కర్నూలు పట్టణంలో మాత్రం గత 35 ఏళ్లుగా అంటే 1985 నుంచి నేటికీ గోలిసోడా వ్యాపారం చేస్తున్నారు.

ఆంధ్రా సోడా పేరుతో 1985లో కేవలం ఒక్క 1 రూపాయికే గోలిసోడా వ్యాపారం మొదలు పెట్టిన రాజు అనే వ్యాపారస్తుడు నేటికి అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.కార్బొనేటెడ్‌ పానీయంగా ఎంతో మంది మనన్నలుపొందిన గోలిసోడా ప్రస్తుతం కొన్ని సాఫ్ట్డ్రింక్స్ కారణంగా ఇవి కనుమరుగపోతున్నాయి. కానీ కర్నూలు పట్టణం లోని మౌర్య ఇన్ సర్కిల్ సమీపంలో ఉండే ఈ ఆంధ్రా సోడాలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.

ఈత పండ్లలో ఎన్నో పోషక విలువలు.. తెలిస్తే అసలు తినకుండా ఉండలేరు..

మాములు రోజుల్లో వీటికి అంత గిరాకీ లేకపోయినా ఈ ఎండాకాలంలో మాత్రం డిమాండ్ బాగుంది అంటున్నారు నిర్వాహకులు. సాధారణ రోజుల్లోకేవలం ఒక 60 గోలి సోడా బాటిల్స్ అమ్మడుపోయేవి కానీ ప్రస్తుతం ఈ వేసవిలో దాదాపుగా 1000 కి పైగా అమ్ముడుపోతున్నాయి. కర్నూలు పట్టణం మొత్తంలో ప్రస్తుతం కేవలం3 షాపుల్లో మాత్రమే లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో లభించే వివిధ ఫ్లెవర్లు సాఫ్ట్ కూల్డ్రింక్స్ అందుబాటులో ఉన్న గోలి సోడాకు మాత్రం డిమాండ్ తగ్గకపోవడం సంతోషం అని తెలిపారు.

2024-05-07T07:33:07Z dg43tfdfdgfd