ఈ ఫోటోలో 9తో పాటు ఒక 6 కూడా ఉంది.. దాన్ని కనిపెడితే మీ కంటి చూపు సూపర్..

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బ్రెయిన్ టీజర్లు (Brain teasers), పజిల్స్ (Puzzles) విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. వీటిలో ఆప్టికల్ ఇల్యూషన్స్‌ ఎక్కువమందిని ఆకట్టుకుంటున్నాయి. ఈ గమ్మత్తైన ఇల్యూషన్స్ మెదడు, కళ్లను మోసం చేస్తాయి. ఈ ఇమేజ్‌ల్లోని చిత్రాలు, రేఖలు, రంగులు మెదడును తప్పుదోవ పట్టించి, వాస్తవానికి లేని విషయాలను చూపిస్తాయి. ఈ పజిల్స్ దృష్టి, మెదడు ఎలా పనిచేస్తాయనే దాని గురించి అవగాహన అందిస్తాయి. కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ చాలా సరదాగా ఉంటాయి, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని పజిల్స్ కష్టంగా ఉంటూ మెదడుకు సవాలు విసురుతాయి. తాజాగా అలాంటి ఒక డిఫికల్ట్ ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్ తీసుకొచ్చాం.

పైన పజిల్ ఇమేజ్‌ను చెక్ చేయండి. ఇది గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్‌తో కనిపిస్తుంది. అందులో వైట్ కలర్‌తో 9 అంకెలు వరుసగా కనిపిస్తాయి. పదికి పైగా వరుసల్లో "9" నంబర్ ఇమేజ్ అంతటా కనిపిస్తుంది. అయితే ఈ తొమ్మిది అంకెల మధ్య ఒక 6 కూడా ఉంది. కానీ అది అంత ఈజీగా కనిపించదు. నంబర్ 6ని కనిపెట్టడమే పజిల్ టాస్క్. దీనిని పరిష్కరించడానికి కేవలం 8 సెకన్ల సమయం మాత్రమే ఇచ్చారు. ఈ టైమ్ లిమిట్ కారణంగా దృష్టి ఏకాగ్రత పెరుగుతాయి. ఒత్తిడిలో మెరుగ్గా పనిచేయగల సామర్థ్యం కూడా పెరుగుతుంది.

చిన్నపాటి వివరాల పట్ల శ్రద్ధ చూపగల వారు దీనిని వెంటనే కనిపెట్టగలరు. మిగతా వారికి కాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు. ఇచ్చిన సమయంలోగా నంబర్ 6 కనిపెట్టగలిగిన వారు చాలా స్మార్ట్, వారి అబ్జర్వేషన్స్ స్కిల్స్ సూపర్ అని చెప్పవచ్చు. డీటైల్స్ పట్ల మంచి శ్రద్ధ చూపగలరని కూడా పరిగణించవచ్చు. చిన్న చిన్న వివరాలు గుర్తించగల సామర్థ్యం నిజ జీవితంలో కూడా చాలా బాగా అవసరమవుతుంది. మరి నెంబర్ 6 కనిపెట్టారా అయితే అభినందనలు. కనిపెట్టని వారు టైమర్ ఆఫ్ చేసి మరోసారి ప్రయత్నించవచ్చు. ఒకవేళ గుర్తించలేక పోతే కింద ఇచ్చిన సొల్యూషన్ పిక్చర్ చెక్ చేయవచ్చు.

* సొల్యూషన్

పైన ఇచ్చిన ఇమేజ్‌లో నంబర్ 6ను బ్లాక్ కలర్ మార్కర్‌తో హైలెట్ చేశాం. ఈ పజిల్ను ఎంజాయ్ చేసి ఉంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి సవాల్ విసరవచ్చు. వారు ఎంత తక్కువ సమయంలో దానిని కనిపెట్టారో ట్రాక్ చేయవచ్చు. ఇలాంటి మరిన్ని పజిల్స్ కోసం న్యూస్ 18 తెలుగు వెబ్‌సైట్ విజిట్ చేయవచ్చు. డైలీ వీటిని సాల్వ్ చేస్తుంటే మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి అని గమనించాలి. ఈ పజిల్స్ కి కొత్త వారు ఆన్సర్స్ వెంటనే కనిపెట్టలేకపోవచ్చు. అలాగని నిరుత్సాహ పడకూడదు. ప్రయత్నం చేస్తూ ఉంటే కంటి చూపు, అబ్జర్వేషన్ స్కిల్స్, థింకింగ్ పవర్, రీజనింగ్ స్కిల్స్ మెరుగుపడతాయి. తద్వారా వీటిని వెంటనే సాల్వ్ చేయడం సాధ్యమవుతుంది. ఈ స్కిల్స్ రియల్ వరల్డ్‌లో చాలా అవసరం అవుతాయి.

2024-05-07T11:33:52Z dg43tfdfdgfd