ఈ బాలుడు చెప్పే వేదాలు వింటే షాక్ అవ్వాల్సిందే..

ఆరేళ్ల వయసులో వేద పాఠశాలలో చేరి వేదాలు అన్ని కంఠస్తంచేసి అవలీలగా గలగల అని వేదాలు అన్ని చెప్పేస్తున్నాడు నల్గొండ జిల్లా లోని నకిరేకల్ పట్టణానికి చెందిన వైష్ణవచార్యులు . ఈ సందర్భంగా ఆ బాలుడిని లోకల్ 18 ప్రత్యేకంగా పలకరించింది. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.వేద పాఠశాలలో తనను ఎందుకు చేర్పించారు, వేదాలు నేర్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని విషయాలనులోకల్ 18 తో పంచుకున్నారు.

వివరాల్లోకెళ్తే.. ఈ సందర్భంగా వైష్ణవచార్యులు లోకల్ 18 తో మాట్లాడుతూ ఆరేళ్ల వయసులో నల్గొండ జిల్లా నార్కట్పల్లిలోని గోపాయపల్లి గుట్ట మీద వేద పాఠశాలలో చేరానని చెప్పారు. ఇక్కడ ఫుడ్ కి రూమ్ కి వేదాలు నేర్పినందుకు ఇటువంటి ఫీజు తీసుకోలేదన్నారుప్రతిరోజు పంచ మీద ఉండాలని, ఆశ్రమంలో ఎటువంటి జీన్స్ వేసుకోవడానికి ఆస్కారం లేదన్నారు. ప్రతిరోజు దినచర్య వచ్చేసి ఉదయం 5 గంటలకి లేచి కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసి వచ్చి ఆరు గంటలకి సంధ్యావందనం ఉంటుందన్నారు. ఆ తర్వాత వచ్చేసి రుద్రాభిషేకం ఉంటుందన్నారు.

Farmer News: రైతన్నలకు అదిరే గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. ఇక డబుల్ ఆదాయం..

అన్ని కూడా 8 గంటల వరకు అయిపోతుందన్నారు. ప్రస్తుతం తను కృష్ణ యజుర్వేదం నేర్చుకోవడం జరుగుతుందన్నారు. ఏడేళ్ల వయసులో తను ఆశ్రమంలో చేరానని చెప్పారు ప్రస్తుత తన వయసు 13 సంవత్సరాలు అన్నారు.ఒక వేదం నేర్చుకోవడానికి 12 సంవత్సరాలు పడుతుందని తెలిపారు. తమ పెద్ద గురువు రాఘవ శర్మ అని.. ఆయనప్రతి 15 రోజులకు ఒకసారి గురువుకి నేర్చుకున్నది చెప్పమంటారన్నారు.

వేదాల గురించి కూడా పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ప్రస్తుతం తను రాజమండ్రి పరీక్ష గురించి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ప్రతి పరీక్షకు సర్టిఫికెట్ ఇస్తారన్నారు. వీటివలన తిరుపతి దేవస్థానంలో వేద పారాయణంగా జాబు పొందవచ్చునని, లేదంటే వేద పాఠశాలలో అధ్యాపకులుగా చేరవచ్చునన్నారు.తనలక్ష్యం వచ్చేసి గోల్డ్ మెడల్ సాధించాలని పెట్టుకున్నానని లోకల్ 18 కి ద్వారా తెలియజేశారు.

2024-05-05T11:26:57Z dg43tfdfdgfd