ఎన్టీ రామారావు.. రోజా రమణి కాళ్లు ఎందుకు పట్టుకున్నాడు?.. కృష్ణా బ్యారేజీ వద్ద వేల మంది గుమిగూడటం వెనక కథేంటి?

పెద్ద ఎన్టీఆర్‌ దర్శకుడిగా చాలా సినిమాలు చేశాడు. ఆయన ఓ సినిమా షూటింగ్‌ సమయంలో సీనియర్‌ నటి రోజా రమణి కాళ్లు పట్టుకున్నాడట. 

 

రోజా రమణి.. బాల నటిగా కెరీర్‌ని ప్రారంభించి హీరోయిన్‌గా అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ,ఒడియాలోనూ సినిమాలు చేసి మెప్పించింది. ఎన్టీఆర్‌ వంటి సీనియర్‌ హీరోల సరసన కూడా నటించి ఆకట్టుకుంది. హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, అలాగే నెగటివ్‌ రోల్స్ లోనూ నటించి అదరగొట్టారు.

 

బాలనటిగా జాతీయ అవార్డుని అందుకున్న రోజా రమణి.. నటిగానే కాదు, వాయిస్‌ ఆర్టిస్ట్ గానూ రాణించారు. ఆమె నాలుగు వందలకుపైగా చిత్రాలకు హీరోయిన్లకి వాయిస్‌ ని అందించడం విశేషం. ఇలా మల్టీఫుల్‌ రంగాల్లో మెప్పించిన ఆమె సీనియర్‌ ఎన్టీఆర్‌తో నాలుగైదు సినిమాల్లో నటించింది. రామారావు దర్శకత్వంలోనూ పనిచేసింది. 

ఎన్టీఆర్‌ దర్శకత్వంలో దర్శకత్వంలో ఓ సినిమా చేసింది రోజా రమణి. ఇందులో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.ఈ సినిమా సమయంలో ఎన్టీఆర్‌.. ఆమె కాళ్లు పట్టుకోవడం, కృష్ణా బ్యారేజీ వద్ద వందలాది మంది గుమి గూడటం జరిగిందట. ఆ సంఘటన గురించి లేటెస్ట్ గా రోజా రమణి వెల్లడించింది. అసలేం జరిగిందో బయటపెట్టింది. 

 

రామారావు దర్శకత్వంలో ఓ మూవీ చిత్రీకరణ కృష్ణా బ్యారేజీ వద్ద జరుగుతుందట. అందులో తనకు సోదరుడిగా హరికృష్ణ నటించారు. ఆ బ్యారేజీ మీద తాను సూసైడ్‌ చేసుకునే సీన్‌ తీస్తున్నారట. ఎన్టీఆర్‌ సినిమా షూటింగ్‌ అనే సరికి వందలాది మంది జనం వచ్చారట. దీంతో ట్రాఫిక్‌ ఆపేయాల్సి వచ్చిందట. ఆ సీన్‌లో బ్యారేజీ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. 

 

ఈ సీన్‌ తీసేటప్పుడు బ్యారేజీ కింద కెమెరా పెట్టారు. పైన రెయిలింగ్‌ కట్టారు. రోజా రమణి కాస్త పొట్టిగా ఉండటంతో ఆమె కెమెరాల్లో పడటం లేదు. రెయిలింగ్‌ అడ్డుగా ఉంది. ఆమెని హై చేయాలంటే ఆమె కింద ఏదైనా పెట్టారు. మండే ఎండ, సమీపంలో ఏమీ లేవు. చాలా ఇబ్బంది అవుతుంది. ఆ సమయంలోనే అటుగా ఓ క్యాన్లతో ఓ కుర్రాడు వెళ్తుంటే, ఎన్టీఆర్‌ పిలిచి ఆ క్యాన్లు తీసుకున్నాడట. 

 

ఎన్టీఆర్‌ పిలవడంతో అతను కూడా ఆ క్యాన్లు ఇచ్చేశాడు. రెండు క్యాన్లపై రోజా రమణి నిలబడింది. బ్రిజ్జ్ పై నుంచి దూకే సీన్‌ చేస్తుండగా, ఆ క్యాన్లు ఊగిపోతున్నారు. మేకప్‌ ఆర్టిస్ట్ పట్టుకున్నాడు కానీ, ఆమెని ఆపలేకపోతున్నాడు. దీంతో తేడా వస్తే ఆమె నదిలో పడిపోతుంది. అది పెద్ద రిస్క్. ఈ విషయాన్ని గమనించిన ఎన్టీఆర్‌ స్వయంగా తనే వచ్చి రోజా రమణి కాళ్లు పట్టుకున్నాడు. ఓ చేతితో ఆమె కాలు, మరో చేతితో క్యాన్లు పట్టుకున్నాడట. 

 

రామారావు ఏంటి తన కాళ్లు పట్టుకోవడమేంటి అని తాను భావోద్వేగానికి గురైందట రోజా రమణి. అది ఏడిచే సీన్‌. నిజంగానే తనకు ఏడుపు వచ్చిందట. బాడీ అంతా షివరింగ్‌ వచ్చేసిందట. అది గమనించి త్వరగా యాక్ట్ చేసి, ఏమ్‌ భయపడకు, బాధపడకు అని ధైర్యం చెప్పాడట ఎన్టీఆర్‌. దీంతో ఈ సీన్‌ చేసేందట. కానీ ఆ సందర్భంలో మాత్రం తాను చాలా భయానికి గురైనట్టు తెలిపింది. అదే సమయంలో తన కెరీర్‌లోనే అదొక బెస్ట్ మూమెంట్ గా నిలిచిపోతుందని పేర్కొంది రోజా రమణి. ట్రీ మీడియా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది రోజా రమణి. హీరో తరుణ్‌ ఆమె కొడుకే అనే విషయం తెలిసిందే.

2024-05-01T10:51:58Z dg43tfdfdgfd