ఎన్టీఆర్ - కె. విశ్వనాథ్ 20 ఏళ్లు మాట్లాడుకోలేదా..? కారణం ఏంటి..? విభేదాలు ఎక్కడ వచ్చాయి..?

పెద్దాయిన సీనియర్ ఎన్టీఆర్, కళాతపస్వి .. కె. విశ్వనాథ్ దాదాపుగా 20 ఏళ్ళు మాట్లాడుకోలేదట. కారణం ఏంటో తెలుసా..? అసలు వీరిమధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి. ఏ విషయంలె వచ్చాయి. 

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ మధ్య విభేదాలు సర్వ సాధారణమే. అందులో  కొన్ని సీరియస్ ఇష్యూస్ గా మారితే.. మరికొన్ని మాత్రం తేలిగ్గానే పరిష్కారం అయ్యాయి. అప్పట్లో స్టార్ హీరోల మధ్య కూడా ఏదో ఒక ఇష్యూ జరగడం.. అది మళ్లీ మర్చిపోయి మాట్లాడుకోవడం లాంటివి జరిగాయి. ఇలాంటివి ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, కృష్ణ లాంటి స్టార్స్ మధ్య కామన్ గా జరిగాయి. ఇప్పుడు అలాంటివి చాలా బయటకు వస్తున్నాయి. 

 

అప్పుడు స్టార్ హీరోల మధ్యనే కాదు.. హీరోలు డైరెక్టర్ల మధ్య కూడా గొడవలు కమన్ గా జరిగేవట. అందులో ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ , కె విశ్వనాథ్ మధ్య వచ్చిన మనస్పర్ధలు 20 ఏళ్ళు కొనసాగాయట. వారు అన్నేళ్లు మాట్లాడుకోలేదట. దానికి కారణంఏంటీ అనేది ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం. పెద్దాయన ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ ఏ పాత్ర చేసి.. అందులో జీవిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే.. దాన వీర శూరకర్ణ లాంటి సినిమాతో ఎన్టీఆర్ కు ఆస్కార్ రావల్సింది. 

మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా..? అప్పట్లో పెద్ద సంచలనమే..?

 

ఒక్క  పౌరాణిక పాత్రలకు మాత్రమే కాదు ఎలాంటి పాత్ర అయినా.. ఆయన  పెట్టింది పేరు. ఒక పక్క సినిమాలు ఇంకా పక్క రాజకీయాలతో బిజీగా ఉండేవారు ఎన్టీఆర. నటుడిగా మాత్రమే కాదు.. ముఖ్యమంత్రిగా కూడా పేదలకు ఎంతో చేసి.. ఆయన దేవుడయ్యాడు. ఇక ఆయనతో ఎంతో మందికి విభేదాలు ఉండేవి. కొందరు మళ్ళీ కలిసిపోయారు.. కొందరు అలానే దూరం అయ్యారు. అటువంటి సందర్భంమే మనం ఇప్పుడ చెప్పుకునేది. 

 

మెగాస్టార్ చిరంజీవి ఘాడంగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా...?

సినిమా విషయంలో కొన్నిసార్లు హీరోలకు.. దర్శకులకు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడం సాధారణంగా జరిగేది. అలానే  ఎన్టీఆర్ - విశ్వనాధ్ మధ్యలో కూడా  ఒక అగాధం ఏర్పడింది. కాని దాని  గురించి చాలామందికి తెలియదు. ఈ ఇద్దరు స్టార్స్  మొదట్లో మంచి స్నేహితులుగా ఉన్నారు.  కానీ ఓ  చిన్న విషయంలో వీరి మధ్య గొడవ వచ్చిందట. అది వారి మధ్య మాటలు లేకుండా చేసింది. దాంతో వీరు జీవవితంలో ఎప్పుడూ కూడా కలిసి పనిచేయలేదు. 

పవన్ కళ్యాణ్ కోసం రేణూ దేశాయ్ త్యాగం, అంత పెద్ద సినిమా వదిలేసుకుందా..? గ్రేట్ కదా..?

ఎన్టీఆర్ కు ఒక అలవాటు ఉంది. ఆయనకు నచ్చకపోయినా.. తన మాటకు ఎవరైనా అడ్డు చెప్పినా.. నచ్చని పని చేసినా.. వెంటనే దూరం పెట్టేస్తారు. ఒక సారి వీనికాంబినేషన్ లో సినిమా షూటింగ్ జరుగుతోందట. ఒక ఎమోషనల్ సీన్ లో కళ్ళద్దాలు పెట్టుకుని చేయాలని ఎన్టీఆర్ర చూశారట. కాని ఎమోషన్ కనిపించడం లేదని అద్దాలు తీయ్యాలని విశ్వనాథ్ పట్టుపట్టారట. ఎన్టీఆర్ మాత్ర కళ్లద్దాలు పెట్టుకునే చేస్తాను అని చెప్పారట. దాంతో విశ్వనాథ్ కూడా తీయాలని పట్టుబట్టడం.. ఇద్దరి మధ్య విభేదానికి కారణం అయ్యిందట. 

 

నిజానికి ఒకే కాలేజిలో వీరు కలిసి చదువుకున్నారు. మొదటి నుంచీ వీరి మధ్య మంచి స్నేహం ఉండేది. కాని కళ్లద్దాలు అనే ఒక చిన్న కారణమే వీళ్ళిద్దరి మధ్య  సమస్యను తీసుకొచ్చింది. 20 ఏళ్ళు మాటలు లేకుండా చేసింది అని ఇండస్ట్రీ టాక్. ఇద్దరు పట్టుదల కలవారు కాబట్టి ఎవరూ తగ్గేదేలే అనుకున్నారట. మరి ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. ఇండస్ట్రీలో మాత్రం టాక్ గట్టిగానే నడుస్తోంది. 

2024-05-07T14:30:10Z dg43tfdfdgfd