ఎన్టీఆర్-రామ్ చరణ్ మధ్య చిచ్చు పెట్టిన పొలిటీషియన్... ఫ్యాన్ వార్ షురూ!

ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్-రామ్ చరణ్ నటించారు. ఎవరి పాత్ర గొప్ప అనే పాయింట్ దగ్గర ఫ్యాన్ వార్ షురూ అయ్యింది. రకరకాల సమీకరణాలు తెరపైకి తెస్తూ మావాడు గొప్పంటే మావాడు గొప్పని సోషల్ మీడియాలో కొట్టుకున్నారు. ఈ ఫ్యాన్ వార్ గ్లోబల్ రేంజ్ కి వెళ్ళింది. ఓ అంతర్జాతీయ అవార్డు ప్రతినిధులు కూడా స్పందించాల్సి వచ్చింది. 

ఆర్ ఆర్ ఆర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ రామరాజు పాత్ర విలక్షణమైనది. కఠినమైనది అని అన్నారు. పరోక్షంగా భీమ్ పాత్ర కంటే రామరాజు పాత్రకే వెయిట్ ఉందని చెప్పకనే చెప్పాడు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ఇటీవల ఈ చిత్రానికి కెమెరామెన్ గా ఉన్న కే కే సెంథిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ కంటే నాకు ఎన్టీఆర్ జంతువులతో అటాక్ చేసే ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే ఇష్టం అన్నాడు. 

అలాగే భీమ్ ని పులి వెంబడించే సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు ఎన్టీఆర్ వేగాన్ని అందుకోలేకపోయామని అన్నాడు. ఈ కామెంట్స్ చరణ్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళను ట్రోల్ చేశారు. తాజాగా బీజేపీ నేత సీఎం రమేష్ ఈ వివాదాన్ని మరోసారి రాజేశాడు. ఢిల్లీ వచ్చిన రామ్ చరణ్ ని సన్మానిద్దాం అని అమిత్ షా కి నేనే చెప్పాను. నా మాటను అంగీకరించి రామ్ చరణ్ ని అమిత్ షా సత్కరించారని అన్నాడు. 

కాగా గతంలో హైదరాబాద్ వచ్చిన అమిత్ షాను ఎన్టీఆర్ కలిశారు. ఈ క్రమంలో సీఎం రమేష్ రికమెండ్ చేస్తే గానీ చరణ్ ని అమిత్ షా గౌరవించలేదు. ఎన్టీఆర్ ని మాత్రం ఆయన స్వయంగా కలవాలని అనుకున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. చిరంజీవి లేకపోతే చరణ్ ని ఎవరు పట్టించుకోరని ట్రోల్ చేస్తున్నారు. 

అదే సమయంలో బీజేపీ నేత బండి సంజయ్ చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియో చరణ్ ఫ్యాన్స్ తెరపైకి తెస్తున్నారు. అమిత్ షా కి కాల్ చేశారు. హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దాం అనుకున్నారు. అలా ఎన్టీఆర్ ని అమిత్ షా కలిశారు. హీరోలను, క్రీడాకారులను, ప్రముఖులను ఆయన కలవడం కామన్. ఎన్టీఆర్ ని కలవడం వెనుక ఎలాంటి ప్రత్యేకత లేదని బండి సంజయ్ అన్నారు 

ఇలా అమిత్ షా కేంద్రంగా ఎన్టీఆర్-రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వార్ కి దిగారు. ఒకరినొకరు కించపరుచుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా వార్ పీక్స్ చేరింది. మరి ఎప్పుడు చల్లబడుతుందో చూడాలి... 

2024-04-23T12:50:31Z dg43tfdfdgfd