ఎస్వీ సంగీత నృత్య కళాశాలలో పార్ట్‌టైమ్ కోర్సులకు అడ్మిషన్లు

ఎస్వీ సంగీత నృత్య కళాశాలలో పార్ట్‌టైమ్ కోర్సులకు అడ్మిషన్లు

తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల‌లో ప్రవేశాల కోసం మే 25 నుంచి  దరఖాస్తులు స్వీకరిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ర్ ఒక ప్రకటనలో తెలిపారు.

తిరుపతి శ్రీ వేంక‌టేశ్వర సంగీత‌, నృత్య క‌ళాశాల‌లో 2024 - 25 విద్యా సంవ‌త్సరానికి సంబంధించి సాయంత్రం పార్ట్‌టైమ్ సర్టిఫికేట్, డిప్లొమా, కళాప్రవేశిక  కోర్సుల ప్రవేశానికి  మే 25వ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రిన్సిపల్ ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు. సాయంత్రం గం.5.30 నుండి గం.6.30 వరకు  ట పార్ట్‌టైమ్, సర్టిఫికేట్, డిప్లొమా, కళాప్రవేశిక కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.  వీటిలో గాత్రం, భ‌క్తి సంగీతం, వీణ, వయొలిన్, వేణువు, మృదంగం , ఘ‌ట్టం,  భరతనాట్యం, కూచిపూడి నృత్యం విభాగాల్లో ప్రవేశాలు  జరుగుతున్నాయి.

   ఈ క‌ళాశాల‌లో హైద‌రాబాదులోని పొట్టి శ్రీ‌రాములు తెలుగు యూనివ‌ర్సిటీ గుర్తింపుపొందిన స‌ర్టిఫికెట్ కోర్సు(4 ఏళ్లు), డిప్లొమా కోర్సు (2 ఏళ్లు) ఉన్నాయి. టీటీడీ నిర్వహించే క‌ళాప్రవేశిక‌ (రెండేళ్ల ఫౌండేష‌న్ కోర్సు) అప్లికేషన్ రూ 50 చెల్లించి కార్యాలయ పని వేళల్లో పొందవచ్చునని చెప్పారు. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను మే 25వ తేదీ నుండి  అన్ని జిరాక్స్ కాపీలతో కలిపి జూన్ 12వ తేదీ లోపు సమర్పించాలని ప్రిన్సిపల్ తెలిపారు. ఇత‌ర వివ‌రాల‌కు 0877-2264597 / 7330811173  / 9848374408  /  9440793205 ఫోన్ ద్వారా లేదా టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org ను సంప్రదించ‌గ‌ల‌రు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-09T09:20:47Z dg43tfdfdgfd