ఎస్సై నుంచి భోలే బాబాగా అవతారం

ఎస్సై నుంచి భోలే బాబాగా అవతారం

  • ఉద్యోగానికి రాజీనామా చేసి బాబాగా అవతారం

భోలే బాబా అసలు పేరు సూరజ్ పాల్ సింగ్.. కాస్​గంజ్​ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆధ్యాత్మిక గురువుగా మారడానికి ముందు సూరజ్​పాల్ సింగ్ ఉత్తర ప్రదేశ్​ పోలీస్ శాఖలో పనిచేశారు. దాదాపు 18 ఏండ్ల పాటు వివిధ హోదాల్లో సేవలందించారు. ఓవైపు ఎస్సైగా డ్యూటీ చేస్తూనే మరోవైపు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తుండేవారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో ప్రవచనాలు చెబుతూ, సత్సంగాలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో భోలే బాబాగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన ప్రవచనాలు వినడానికి జనం తండోపతండాలుగా వస్తారు. సూరజ్​పాల్ నుంచి భోలే బాబాగా పేరొందినా.. నారాయణ్ సాకార్ హరి గా పిలిపించుకునే వారు. పెద్ద సంఖ్యలో శిష్యులు, లక్షలాది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఆయన అనుచరులు సాకార్ విశ్వ హరి బాబాగా పిలుచుకుంటారు. ఎల్లప్పుడూ తెల్లటి దుస్తులు ధరించి, వెంట తన ధర్మపత్నితో సత్సంగాలలో పాల్గొంటారు. భగవంతుడి ఆశీర్వాదం పొందిన తనే నిజమైన గురువునని, ఇతరులను గురువులుగా ఆరాధించవద్దని భోలే బాబా బోధించేవారు.

బాబా ఫేస్ బుక్ పేజీకి దాదాపు మూడు లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బోలే బాబా నిర్వహించే సత్సంగాలకు హాజరయ్యే వారు. ఇంతగా పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ భోలే బాబా మీడియాను దూరం పెట్టేవారు. దీంతో ఆయనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఎక్కువగా బయటకు రాలేదు. బాబా నిర్వహించే సత్సంగాల నిర్వహణ బాధ్యతలు ఆయన శిష్యులు చేపట్టేవారు. గులాబీ రంగు షర్ట్​, ప్యాంట్ ధరించి నెత్తిన తెల్ల టోపీతో సత్సంగాలలో పనులు చక్కబెడతారు. ఎక్కువగా మంగళవారాలే భోలే బాబా తన సత్సంగాలను నిర్వహిస్తారు.

©️ VIL Media Pvt Ltd.

2024-07-03T02:48:12Z dg43tfdfdgfd