ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ లేటెస్ట్ లుక్ వైరల్

ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, స్పిరిట్, సలార్ ప్టార్ 2 షూటింగ్‌లను పూర్తి చేయాల్సి ఉంది. కానీ ప్రభాస్ మాత్రం ఇంకా సెట్స్ మీదకు రాలేదు. ఈ మధ్యే యూరప్‌లో ఓ కొత్త ఇంటిని తీసుకున్నాడనే వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఇప్పుడు రెస్ట్ మోడ్‌లో ఉన్నాడని తెలుస్తోంది. ఇక ఈ నెల్లోనే రాజా సాబ్ సెట్ మీదకు ప్రభాస్ వస్తాడనే టాక్ ఉంది. ఇక ఈ ప్రథమార్దంలోనే స్పిరిట్ షూటింగ్ కూడా ప్రారంభిస్తారని సమాచారం. ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ డేట్ మీద ఇంకా క్లారిటీ రాలేదు. మే 9న రావాల్సిన ఈ మూవీ ఎన్నికల కారణంగా వాయిదా పడిందని తెలిసిందే.

ఇలా ప్రభాస్ సినిమా సంగతులన్నీ కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి.ఇక సలార్ రెండో పార్ట్ షూటింగ్ కూడా జూన్, జూలైలో ప్రారంభం అవుతుందని సమాచారం. హను రాఘవపూడి అయితే ఆల్రెడీ మూడు పాటలు కంపోజ్ చేయించాడట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభం అయిందట. ఇక ప్రభాస్ డేట్స్ ఇస్తే షూటింగ్‌కు వెళ్లేలానే ఉన్నాడు. కానీ ప్రభాస్ డేట్స్ ఎప్పుడు వస్తాయి.. ఏ రోజు ఏ సెట్ మీద ఉంటాడనే విషయంపై క్లారిటీ లేదు.

ప్రభాస్ లేటెస్ట్ లుక్ అంటూ ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంది. ఇందులో ప్రభాస్ స్లిమ్‌గా ఉన్నాడు. ప్రభాస్‌ని చూస్తే ఏదో యాక్షన్ మూవీకి రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రభాస్ జుట్టు, లుక్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ బాడీతో సినిమా వస్తే అదిరిపోతుందని అభిమానులు సంబరపడుతున్నారు. ప్రభాస్ లెటెస్ట్ లుక్ అని ట్రెండ్ అవుతున్న ఈ వీడియో పాతదా? కొత్తదా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-18T04:10:01Z dg43tfdfdgfd