ఏ కరెక్షన్ చెప్పలేకపోయా.. చక్కగా తీశాడు : సుకుమార్

సుకుమార్ కాంపౌండ్ నుంచి వస్తున్న దర్శకులు మిరాకిల్స్ చేస్తున్నారు. సుకుమార్ బ్రాండ్ దర్శకులు అనేది కనిపిస్తే చాలు సినిమా బ్లాక్ బస్టర్ అవుతోంది. ఇప్పుడు సుకుమార్ దగ్గర పలు సినిమాలకు పని చేసిన అసిస్టెంట్ దర్శకుడు అర్జున్ తీసిన ప్రసన్న వదనం అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ మే 3న రాబోతోంది. ఈ క్రమంలో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సుకుమార్ సందడి చేశాడు. సుకుమార్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

సుహాస్‌ అంటే తనకు, బన్నీకి చాలా ఇష్టమని సుకుమార్ చెప్పుకొచ్చాడు. ముందుగా ‘పుష్ప’లోని హీరో ఫ్రెండ్‌ క్యారెక్టర్ కేశవగా సుహాస్‌ని అనుకున్నారట.. కానీ అప్పటికే సుహాస్ హీరోగా చేస్తున్నాడని తెలిసి వద్దని అనుకున్నారట. నాని నటన అంతే తనకు బాగా ఇష్టమని, సుహాస్‌.. ఫ్యూచర్‌ నానిలా అనిపిస్తున్నాడని సుకుమార్ ప్రశంసించాడు. నాని సహజ నటుడు కాబట్టి సుహాస్‌ని మట్టి నటుడు అనాలేమో అని స్టేజ్ మీదే సుహాస్ మీద ప్రశంసలు కురిపించాడు. సుహాస్ నటన అంత ఆర్గానిక్‌గా ఉంటుందని, తన నటన చూస్తున్నానని, ఆయా పాత్రల్లో ఇమిడిపోతాడని మెచ్చుకున్నాడు.

ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడని అన్నాడు. తన శిష్యుడు అర్జున్‌కి సినిమా ఇచ్చిన నిర్మాతలు ధన్యవాదాలను తెలిపాడు. ‘జగడం’ సినిమా రూపొందిస్తున్న సమయంలో అర్జున్‌ కలిశాడని నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. ‘ఆర్య’ చిత్రం బాగా నచ్చిందని, తన వద్ద పని చేయాలనుకుంటున్నా అని చెప్పడంతో జాయిన్ చేసుకున్నాడట. అర్జున్ చాలా అమాయకుడని, కానీ, బోలెడు లాజిక్‌ ఉన్నవాడని మెచ్చుకున్నాడు.

అర్జున్‌, మరో అసిస్టెంట్‌ తోట శ్రీనుతో కలిసి 23 రోజుల్లో ‘100% లవ్‌’ స్టోరీ రాశానని చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి నా ప్రతి సినిమాకి వీరిద్దరు పనిచేస్తూ వచ్చారని అన్నాడు. అర్జున్‌కి ఏదైనా సమస్య చెబితే పరిష్కారం క్షణాల్లో చెబుతాడని అన్నాడు. నిజానికి తను హాలీవుడ్‌లో ఉండుంటే.. మరో స్థాయి సినిమా తీసేవాడని ఆకాశానికి ఎత్తేశాడు.

అర్జున్‌ బిజీగా ఉండడంతో తాను లాజిక్‌ ఉన్న సినిమాలను మానేశానంటేనే అర్థం చేసుకోండన్నాడు. ఆ లాజిక్‌లతోనే ప్రసన్న వదనం తీశాడని, తను చాలా నిజాయితీ పరుడని, ఈ సినిమాని చాలా నిజాయితీగా తీశాడన్నాడు. ఈ సినిమా చూశానని, చాలా బాగుందని, ఏ కరెక్షన్ చెప్పలేకపోయానని అన్నాడు. అంత చక్కగా తీశాడని, థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండని సుకుమార్ స్టేజ్ మీద వేడుకున్నాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-27T07:05:24Z dg43tfdfdgfd