ఒక జీవిత అనుభవాన్ని పంచుకునేలా.. ఆ ఒక్కటీ అడక్కు

ఒక జీవిత అనుభవాన్ని పంచుకునేలా.. ఆ ఒక్కటీ అడక్కు

‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని డైలాగ్ రైటర్ అబ్బూరి రవి చెప్పారు. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా అబ్బూరి రవి మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరి జీవితంలో సెటిల్ అవ్వడం అంటే ఉద్యోగం రావడం, పెళ్లి కావడం. అయితే ఇప్పుడు పెళ్లి విషయంలో యావరేజ్ ఏజ్ మారిపోయింది. ఒకప్పుడు ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత చేసుకునేవారు. ఇప్పుడు ఎప్పుడు చేసుకుంటారో ఎవరికీ తెలీదు. 

అందరూ సెటిల్మెంట్ గురించే మాట్లాడతారు. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ‘సెటిల్మెంట్ అంటే ఉద్యోగం, పెళ్లి కాదు.. మనకి ఒక అవసరం వచ్చినపుడు పక్కవాడి దగ్గర చేయి చాచకపోవడం’ అని నరేష్ చెప్పే డైలాగ్ చాలా మందికి కనెక్ట్ అవుతుంది. పెళ్లి ఆలస్యమైతే సమాజంలో తను ఎదుర్కొనే ఇబ్బందులను ఫన్నీగా చెబుతూనే ఎమోషనల్‌‌‌‌‌‌‌‌గా చూపించారు దర్శకుడు మల్లి. పెళ్లి ఎంతో పవిత్రమైనది. ఒకప్పుడు ఇంట్లో పెళ్లి చూపులు జరిగితే ఆ ఇంటి సాంఘిక పరిస్థితులు తెలిసేవి. 

ఇప్పుడు హోటల్స్‌‌‌‌‌‌‌‌లో జరగుతుండడంతో అసలు పరిస్థితులు అర్ధం కావడం లేదు. ఒక బంధం బలంగా నిలబడాలంటే చాలా జాగ్రత్తగా వుండాలి. ఇలాంటి చాలా ఆసక్తికరమైన అంశాలతో.. ఒక జీవిత అనుభవాన్ని పంచుకునేలా ఉంటుంది. ఇందులో క్యారెక్టర్, సిట్యువేషన్‌‌‌‌‌‌‌‌లో కామెడీ ఉంది. సిట్యువేషన్, కంటెంట్‌‌‌‌‌‌‌‌లో మేటర్ ఉంటే కామెడీ అద్భుతంగా రాయొచ్చు. నరేష్,  జామి లివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ హిలేరియస్‌‌‌‌‌‌‌‌గా వుంటాయి. ఇది పెళ్లికాని ప్రతి వారు కోరుకునే కంటెంట్. క్లీన్ ఎంటర్ టైనర్. ఇక ప్రస్తుతం  గూఢచారి2, డెకాయిట్ చిత్రాలకు డైలాగ్స్ రాస్తున్నా’ అని చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-01T02:40:49Z dg43tfdfdgfd