కన్యత్వం గురించి కొడుకు ముందే తెలుగు హీరోయిన్ ఓపెన్.. ఇదేం సంప్రదాయం అంటూ..

మలైకా అరోరా గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ఆమె తెలుగులో పలు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసింది. ముఖ్యంగా గబ్బర్ సింగ్‌లో కెవ్వు కేక అంటూ ఆడిపాడింది. ఆ తర్వాత కూడా పలుచిత్రాల్లో ఐటెమ్ నంబర్స్ చేసింది. ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అది అలా అంటే మలైకా తన కొడుకును 'కన్యత్వం' గురించి ప్రశ్నించిందట. దీంతో ఆమెకు ఊహించని విధంగా జవాబు వచ్చిందట. మలైకా కొడుకు అర్హాన్ ఖాన్ ఓ పాడ్‌కాస్ట్ చేస్తున్నాడు. దీని పేరు 'దమ్ బిర్యానీ'. ప్రతీ ఎపిసోడ్‌లో వివిధ సమస్యలపై మాట్లాడుతుంటారు. అందులో భాగంగా ఇప్పటికే సోహైల్ ఖాన్, అర్బాజ్ ఖాన్ పోడ్‌కాస్ట్‌లో అతిథులుగా కనిపించారు. ఇప్పుడు ఇక మలైకా అరోరా పోడ్‌కాస్ట్‌లో అతిథి వస్తోంది. దీనికి సంబంధించిన ఓ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఎపిసోడ్ ప్రోమోలో మలైకా తన కొడుకుతో నీ 'కన్యత్వం' ఎప్పుడు కోల్పోయావు అని అడుగుతుంది. ఒక క్షణం విరామం తర్వాత, అర్హాన్ ఖాన్ తన తల్లితో నువ్వు (social climber ) (సామాజికంగా ఉన్నత స్థితిని పొందాలని ఆత్రుతగా ఉన్న వ్యక్తి.) సోషల్ క్లైంబర్‌వా అని అడుగుతాడు. అయితే ఆమె వెంటనే దాన్ని ఖండించింది.

ఇక ఈ తర్వాత 'నా తదుపరి ప్రశ్న మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?' అని అడుగుతాడు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా.. ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.. తల్లీ కొడుకులు ఇలా మాట్లాడుకోవడం ఏంట్రా బాబు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

ఇక మలైకా, తన భర్త అర్బాజ్‌తో వివాహమైన 19 సంవత్సరాల తర్వాత విడిపోయింది. వీరు 2017లో విడాకులు తీసుకున్నారు. అర్బాజ్ గత ఏడాది డిసెంబర్‌లో మేకప్ ఆర్టిస్ట్ షౌరా ఖాన్‌ను వివాహం చేసుకున్నారు, ఇక మరోవైపు, మలైకా అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. వీరి పెళ్లి గురించి చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

2024-04-17T06:04:02Z dg43tfdfdgfd