కల్కి 2898AD కథంతా అబద్దమే.. పూజారి సంచలన వ్యాఖ్యలు !

కల్కి సినిమాలో చూపించింది అంతా నిజమేనా.. కల్కి సినిమాలో చెప్పిన విధంగా పురాణాలకు, ఇతిహాసాలకి సంబంధం ఉందా.. మహాభారతానికి కలియుగానికి సినిమాలో చూపించిన దానికి వేరియేషన్ ఏంటి..!

కల్కీ సినిమా. ఈ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న సినిమా కూడా ఇదే. పాన్ ఇండియా సినిమాగా తెరమీదకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాలో ఉన్న ప్రతి సీన్ ఓ హైలెట్ అంటున్నారు సినీ విశ్లేషకులు. అమితాబచ్చన్, దీపికా పదుకొనే వంటి వారందరూ తమ పాత్రలలో లీనమై మెప్పించారు. ప్రపంచం మొత్తం మీద రిలీజ్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించి కలెక్షన్స్ లో కూడా ముందంజలో ఉంది. కానీ ఓ రకమైన ప్రేక్షకులను నిరుత్సాహ పరిచిందన్న కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనా సినిమా మాత్రం బాక్సాఫీస్ విషయంలో సూపర్ కలెక్షన్స్ సాధించింది.

అయితే కల్కి సినిమాలో చూపించిన పాత్రలు.. అలాగే మహాభారతం ఇతిహాసం.. అలాగే కలియుగాంతంలో శంభాల నగరం.. ఇతరత్రా అన్ని కూడా నిజాలేనా.. అనే విషయం మీద చాలా వరకు ఇప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి. ఇది దర్శకుడు నాగ అశ్స్విన్ ఊహాజనితమైన కథనంగా చాలా వరకు భావించాలా.. లేదంటే నిజంగానే మహాభారతం నుంచి కలియుగంతో కల్కీకి ఏదైనా సంబంధం ఉందా.. అనే విషయాలని ఇక్కడ చాలా వరకు నిపుణులు, అలాగే వేద పండితులు చర్చించుకుంటున్నారు. మహా భారతంలో అర్జున కర్ణ సంవాదం, అలాగే అశ్వద్ధామ, కర్ణ సంవాదం, అలాగే అర్జునుడు శ్రీకృష్ణ, అశ్వద్ధామ ఇద్దరు మాట్లాడుకోవడం వంటివన్నీ కూడా కల్పితమా.. అసలు ఇవన్నీ కల్పిత ఊహాజనితమైన పాత్రలా లేదంటే నిజంగానే జరిగిందా అనే విషయం చాలా వరకు చర్చనీయాంశమవుతోంది.

ఈ సందేహాలపై వేద పండితులు కందుకూరి బాలసుబ్రమణ్య శర్మ మాట్లాడుతూ.. ఇదంతా కూడా కేవలం మిధ్య అని మాత్రం చెప్పారు. సినిమా కథ, కథనం అదంతా కూడా వాస్తవాలకు దూరంగా ఉందని, సినిమా వాస్తవాలను ప్రతిబింబించేలా లేదన్నారు. కలియుగాంతం అప్పుడే కాదని తెలిపారు. కలియుగం ప్రారంభ కాలంలో మనం నివసిస్తున్నామని, కలియుగాంతం కావడానికి ఇంకా కొన్ని వేల సంవత్సరాలు పడుతుందని పండితులు సుబ్రమణ్యం చెప్పారు.

అలాగే కలియుగాంతంకు ధర్మం పూర్తిగా నశిస్తుందని, అలాగే యజ్ఞాలు, యాగాలు పూర్తిగా ఆగిపోయి దైవారాధన, ప్రకృతి వైపరీత్యాలు దాపురిస్తాయని, కలియుగాంతంలో చాలా దారుణాలు చూడాల్సి వస్తుందన్నారు. అందులో ఒక్కశాతం మాత్రమే మనం ఇప్పుడు చూస్తున్నామని.. ఇదే పురాణాలు చెబుతున్నాయని తెలిపారు. అయితే సినిమాలో మాత్రం కొన్ని సన్నివేశాలు చక్కగా చిత్రీకరించారన్నారు. ధర్మం గతి తప్పుతుందని.. అలాగే కొన్ని ప్రకృతి నియమాలు పాటించాలని చాలా బాగా సినిమాలో చూయించడం జరగిందన్నారు. సినిమాని వినోదంగా చూడాలి తప్ప వాస్తవాలు ఉన్నాయని మాత్రం భావించొద్దని సుబ్రమణ్య శర్మ వివరించారు.

2024-07-03T13:46:58Z dg43tfdfdgfd