కోవిడ్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో ఎందుకు తొలగించారు?.. ఇదీ కారణం!

కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వల్ల కలిగే దుష్ప్రభావాల కారణంగా ఫొటోను తొలగించినట్లు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

(malayalam.indiatoday.in టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)

"బస్సు ప్రమాదానికి గురైనప్పుడు, డ్రైవర్ సాధారణంగా దిగి పారిపోతాడు. కోవిషీల్డ్ తీవ్రమైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని తయారీదారులు కోర్టులో అంగీకరించవలసి వచ్చింది. దీంతో కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ నుంచి మోదీ మాయమయ్యారు. ఇదీ మోదీ తాజా హామీ." అని ఓ ఫేస్‌బుక్ పోస్ట్ ఉంది.

కోవిడ్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో ఎందుకు తొలగించారు?

ఈ ప్రముఖ పోస్ట్, తప్పుదారి పట్టించేలా ఉందని ఇండియా టుడే జరిపిన విచారణలో తేలింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం వ్యాక్సిన్ సర్టిఫికెట్ నుంచి ప్రధానమంత్రి చిత్రం తొలగించారు.

పోస్ట్‌కి సంబంధించి ఆర్కైవ్ చేసిన లింక్.

విచారణ

కోవిడ్ సర్టిఫికెట్ల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించడం గురించిన వార్తలను మేము మొదట తనిఖీ చేసాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా కోవిన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని చిత్రాన్ని తొలగించారనే శీర్షికతో మే 1న ది హిందూ సవివరమైన వార్తను ప్రచురించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల నుంచి నరేంద్ర మోదీ ఫొటో, పేరు తొలగించారు. రిపోర్టు ప్రకారం, లోక్‌సభ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఈ ఫొటో తొలగించారు. ఈ రిపోర్ట్ స్క్రీన్ షాట్ కింద ఉంది.

కోవిడ్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో ఎందుకు తొలగించారు?

కోవిన్ సర్టిఫికెట్ల నుంచి మోదీ చిత్రాన్ని తొలగించడంపై మలయాళ మీడియా కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. మే 2న రిపోర్టర్ టీవీ ప్రచురించిన రిపోర్టులో, ఎన్నికలకు సంబంధించి కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌పై మోదీ ఫొటోను ముందుగానే తొలగించారని స్పష్టమైంది. గతంలో 2022లో 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కోవిన్ సర్టిఫికెట్ నుంచి ప్రధాని చిత్రాన్ని తొలగించారు. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్‌, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సంఘం సూచనల మేరకు కోవిన్ సర్టిఫికెట్ నుంచి మోదీ చిత్రాన్ని తొలగించారు. రిపోర్టర్ టీవీ అందించిన వార్తల స్క్రీన్ షాట్ కింద ఉంది.

కోవిడ్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో ఎందుకు తొలగించారు?

కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ పొందిన వ్యక్తులు చాలా అరుదుగా దుష్ప్రభావాలను కలిగి ఉంటారని వ్యాక్సిన్ తయారీదారు ఆస్ట్రాజెనెకా ఇటీవల వెల్లడించింది. బ్రిటీష్-స్వీడిష్ బహుళజాతి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ కంపెనీ ఆస్ట్రాజెనెకా బ్రిటీష్ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొంతమందికి టిటిఎస్, రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్‌లెట్స్, తలనొప్పి వంటి దుష్ప్రభావాలు ఉన్నాయని వెల్లడించింది. దీని గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికను ఇక్కడ చదవండి.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కోవిన్ సర్టిఫికేట్ నుంచి, కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాల వల్ల కాకుండా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ప్రధాని మోదీ చిత్రాన్ని తొలగించినట్లు స్పష్టమైంది.

వాస్తవ తనిఖీ

కోవిడ్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో ఎందుకు తొలగించారు?

వాదన

కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాల గురించి సమాచారం రావడంతో వ్యాక్సిన్ సర్టిఫికెట్ల నుంచి నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించారని తప్పుడు ప్రచారం జరుగుతోంది.

ముగింపు

లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా కోవిన్ సర్టిఫికెట్‌లో మోదీ చిత్రాన్ని తొలగించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిత్రాన్ని కూడా తొలగించారు.

కాకుల సంఖ్య మోసం యొక్క తీవ్రతను సూచిస్తుంది

ఒక కాకి: అర్ధ సత్యం

రెండు కాకులు: చాలా వరకు అవాస్తవం

మూడు కాకులు: పూర్తిగా అవాస్తవం

(శక్తి కలెక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా malayalam.indiatoday.in అందించిన ఇన్‌పుట్స్ ఆధారంగా ఈ కథనం పబ్లిష్ చేశాం.)

2024-05-07T07:03:17Z dg43tfdfdgfd