క్రిశాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కేటీఆర్ ములాఖత్

క్రిశాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కేటీఆర్ ములాఖత్

  •     తప్పు చేయకపోయినా జైల్లో పెట్టించారని కామెంట్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ సోష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ మీడియా క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్వీన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నె క్రిశాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బీఆర్ఎస్ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంచ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ జైల్లో బుధవారం ములాఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్ అయ్యారు. అనంత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రం ఆయన మీడియాతో మాట్లాడారు. క్రిశాంక్ తప్పు చేయకపోయినా.. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అతన్ని జైల్లో పెట్టించారని ఆరోపించారు. రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తప్పు చేసి.. ఆ తప్పును కప్పి పుచ్చుకోవడానికి క్రిశాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జైల్లో పెట్టించారన్నారు.

ఉద్దేశ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్వకంగా కేసులు పెట్టి.. రేవంత్ రెడ్డి చిల్లర రాజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కీయం చేస్తున్నార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కేటీఆర్ మండిప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్డారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ఆగడాలకు బదులు ఇస్తామని కేటీఆర్​హెచ్చరించారు. రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టు చేసిన సర్క్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, క్రిశాంక్ పోస్టు చేసిన సర్క్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిపుణులు ముందు పెడుదామని.. క్రిశాంక్  పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని తేలితే అతనితో పాటు తాను కూడా జైలుకు వెళ్తానని కేటీఆర్ అన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-09T03:34:34Z dg43tfdfdgfd