గతంలోనూ.. హిమచల ప్రదేశ్ నైనా దేవిగుడిలో తొక్కిసాలాట

గతంలోనూ.. హిమచల ప్రదేశ్ నైనా దేవిగుడిలో తొక్కిసాలాట

గతంలో కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో తొక్కిసలాటలు జరిగి భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గత కొన్నేండ్లలో జరిగిన దుర్ఘటనలు..

2005లో మహారాష్ట్రలోని మంధారదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 340 మంది భక్తులు చనిపోయారు.

2008లో రాజస్థాన్ లోని చాముండా దేవి ఆలయంలో తొక్కిసలాట.. 250 మంది మృతి.

2010లో ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్  జిల్లా రామ్ జానకి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 63 మంది మరణించారు.

2011లో కేరళలోని పల్మేడులో అయ్యప్ప దీక్ష ముగించుకొని పాదయాత్ర చేస్తూ ఇంటికెళ్తున్న భక్తులపై జీపు దూసుకెళ్లి తొక్కిసలాట జరగడంతో 104 మంది చనిపోయారు.

2013లో మధ్యప్రదేశ్ లోని దాతియా జిల్లా రతన్ గఢ్  గుడిలో నవరాత్రి రోజుల్లో తొక్కిసలాట జరిగి 115 మంది చనిపోయారు.

2023లో మధ్యప్రదేశ్ లోని ఇండోర్​లో రామ నవమి సందర్భంగా యజ్ఞం నిర్వహిస్తుండగా.. పైకప్పు కూలి 36 మంది ప్రాణాలు కోల్పోయారు.

©️ VIL Media Pvt Ltd.

2024-07-03T03:03:14Z dg43tfdfdgfd