ఘనంగా కూన శ్రీశైలం గౌడ్​ బర్త్​డే

ఘనంగా కూన శ్రీశైలం గౌడ్​ బర్త్​డే

జీడిమెట్ల, వెలుగు : కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ పుట్టినరోజు వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. గాజులరామారంలోని చిత్తారమ్మ ఆలయంలో శ్రీశైలం గౌడ్​ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ ఆఫీసులో కార్యకర్తలు, ప్రజల సమక్షంలో కేక్ కట్ చేశారు. కుత్బుల్లాపూర్​కాంగ్రెస్​ఇన్​చార్జ్​కొలను హనుమంత్ రెడ్డి

పలువురు నాయకులు శ్రీశైలం గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన డైరీని కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ తో కలిసి శ్రీశైలం గౌడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మోతి శ్రీనివాస్, వెంకట్, రమేశ్​తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-06-18T01:46:39Z dg43tfdfdgfd