చదువు కోసం ముంబై వెళ్లి.. చిత్రకారుడిగా గుర్తింపు.. అక్కడ ఏమి జరిగిందంటే!

ఈయనకు చిత్రాలు గీయడం అంటే ప్రాణం. ఆ ఇష్టం తోనే ఈయన ఏ చిత్రం గీసినా ఆ చిత్రం మనతో మాట్లాడుతున్నట్లు ఆ భావం మనకు కలగాల్సిందే. అందులో ఎక్కువగా ఈయన దైవానికి సంబంధించిన చిత్రాలను గీస్తూ తనదైన శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈయన ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి తాలూకా వడ్లమూడి గ్రామానికి చెందిన గిరిధర్ గౌడ్... ఈయన హైదరాబాదులో చిత్ర ప్రదర్శన నిర్వహించిన సందర్భంగా లోకల్ 18 ఆయనను ప్రత్యేకంగా పలకరించింది.

గుంటూరు జిల్లా తెనాలి తాలూకా వడ్లమూడి గ్రామానికి చెందిన గిరిధర్ గౌడ్ కు చిత్రాలు వేయడం అంటే ఎనలేని ఆసక్తి. అయితే ఈయన మైసూరులో డిగ్రీ పూర్తి చేసుకొని పై చదువుల కోసం ముంబై కి వెళ్లారు. అక్కడ గుండిజి అనే ఆర్టిస్ట్ వేస్తున్న చిత్రాలను చూసి తాను సైతం అదే రీతిలో చిత్రాలను గీయాలని నిర్ణయించుకున్నారు గిరిధర్ గౌడ్. అనుకున్నదే తడవుగా గుండీజి వద్ద పెయింటింగ్ స్టైల్ ను శిక్షణ ద్వారా తెలుసుకొని పెయింటింగ్ వేయడం ప్రారంభించారు. గుండిజి సిరిపుర అనే విధానంలో చిత్రాలను గీయడంలో దిట్ట. అదే రీతిలోనే గిరిధర్ గౌడ్ సైతం చిత్రాలను గీసే ప్రయత్నాన్ని ప్రారంభించారు.

Railway Museum: వందేళ్ల నాటి యంత్రాలు ఇవి... ఈ రైల్వే మ్యూజియంలో చూడొచ్చు

1996వ సంవత్సరంలో గిరిధర్ గౌడ్ మినీయేచర్ పెయింటింగ్ లో సిరిపుర స్టైల్ అమలు చేయడాన్ని ప్రారంభించి పెయింటింగ్ లో గొప్ప మార్పులు తీసుకువచ్చారు. ఈయన చిత్రాలు గీస్తే ప్రాణంతో ఉన్నాయా అని అనిపించకమానదు మనకు. చిత్రాలు గీయడంలో గిరిధర్ గౌడ్ ప్రత్యేక గుర్తింపు పొంది విష్ణు పురాణం, కురుక్షేత్రము, శ్రీ కృష్ణుడు, అర్జునుడు లాంటి పాత్రల గురించి తన పెయింటింగ్స్ ద్వారానే ఈయన చాటి చెప్పడం విశేషం. హైదరాబాదులో జరిగిన కళాకృతి ఎగ్జిబిషన్ సెంటర్లో ఈయన తన చిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా లోకల్18 తో ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో తాను తన చిత్రాల ద్వారా భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరుగుతుందన్నారు.

Kondagattu Temple: కొండగట్టు ఆలయానికి హనుమాన్ భక్తుల పాదయాత్ర

ఇంకా ఈ చిత్రాలను గీయడంలో పూర్తిస్థాయి మెలకువలను పలు ప్రాంతాలకు వెళ్లి తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. పై చదువులకు ముంబై వెళ్ళిన ఈయన కేవలం ఒక చిత్రకారుడి చిత్రకళ కు ముగ్ధులై .. స్వతహాగా చిత్రాలు గీయడం.. తానొక చిత్రకారుడిగా గుర్తింపు పొందడం కూడా ప్రశంసనీయం. ఏది ఏమైనా 50 ఏళ్ల వయసులో గిరిధర్ గౌడ్ తన చిత్రాల ద్వారా పేరు ప్రఖ్యాతులు సాధించడం అభినందనీయమే కదా !

2024-04-23T11:24:54Z dg43tfdfdgfd