చిరంజీవి ఎవరో తెలియదన్న జూనియర్ ఎన్టీఆర్... లైవ్ లో నాగార్జున క్లాస్, అప్పుడు ఏం జరిగిందో తెలుసా?

దశాబ్దాల పాటు పరిశ్రమను ఏలిన చిరంజీవి ఎవరో తెలియదని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్ చేయడం అప్పట్లో పెద్ద వివాదం అయ్యింది. నాగార్జున కూడా ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఆ కథ ఏమిటో చూద్దాం.. 

 

నందమూరి తారక రామారావు నటవారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అనతి కాలంలో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ అయ్యాడు. ఆది వంటి బ్లాక్ బస్టర్ పడే నాటికి ఎన్టీఆర్ వయసు కేవలం 19 ఏళ్ళు . 

 

ఆ వెంటనే ఆయనకు సింహాద్రి రూపంలో ఇండస్ట్రీ హిట్ పడింది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి టాలీవుడ్ రికార్డ్స్ చెరిపివేసింది. అతి చిన్న ప్రాయంలో స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ పరిణితి లేకుండా మాట్లాడాడు. అవి వివాదాస్పదం అయ్యాయి. 

 

సింహాద్రి సక్సెస్ అనంతరం ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. సదరు యాంకర్ చిరంజీవి గురించి చెప్పాలని ఎన్టీఆర్ ని అడిగింది. ఎన్టీఆర్ పొగరుగా సమాధానం చెప్పాడు. నాకు తెలిసిన అతిపెద్ద స్టార్ మా తాత ఎన్టీఆర్ మాత్రమే. చిరంజీవి ఎవరో తెలియదు అన్నాడు. 

 

ఈ కామెంట్ వివాదాస్పదం అయ్యింది. ఆ ఇంటర్వ్యూ చూస్తున్న నాగార్జున వెంటనే కాల్ చేశాడట. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని అన్నాడట. అప్పుతో ఈ స్థాయిలో గొడవ జరిగిందని సమాచారం. వయసు పెరిగే కొద్ది ప్రణితి సాధించిన ఎన్టీఆర్.. గొప్ప స్పీకర్ అయ్యాడు. సమయానుసారంగా ఎలా స్పందించాలో తెలుసుకున్నాడు . 

 

ఇక సింహాద్రి సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ కి వరుస ప్లాప్స్ పడ్డాయి. రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ విడుదలయ్యే వరకు ఎన్టీఆర్ కి హిట్ లేదు. అంతగా ఎన్టీఆర్ ఇబ్బంది పడ్డాడు. 

2024-05-05T05:36:41Z dg43tfdfdgfd