మొన్న ఓ ఈవెంట్లో చిరంజీవి, సుమ మధ్య జరిగిన కోట్ దొంగ కన్వర్జేషన్ బాగా పేలింది. కానీ ఇప్పుడు అది సుమ పరువు తీస్తుంది. ఆమె కొంప ముంచుతుంది.
యాంకర్ సుమ హోస్ట్ గా ఉన్న ఏదైనా ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి వచ్చారంటే ఏదో రకంగా ఇద్దరి మధ్య సరదాగా కన్వర్జేషన్ ఉంటుంది. నవ్వులు పూయించేలా చేస్తారు. లేదంటే ఏదైనా ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకోవడమా? కొత్త విషయాలను పంచుకోవడమా జరుగుతుంటాయి. ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఓ ఈవెంట్లో చిరంజీవి చేసిన పని ఇప్పుడు యాంకర్ సుమకి పెద్ద ఇబ్బందిగా మారింది. పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇంతకి ఏం జరిగిందంటే..
ఆ మధ్య చిరంజీవి గెస్ట్ గా డిజిటల్ మీడియాకి సంబంధించిన ఈవెంట్ జరిగింది. ఇందులో యాంకర్ సుమ హోస్ట్ గా చేశారు. ఈవెంట్లో స్టేజ్‌పై చిరంజీవి, సుమ మధ్య ఓ ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ నడిచింది. అందులో యాంకర్ సుమ ఓ కోట్,ప్యాంట్ వేసుకుని వచ్చింది. అయితే అది తనదే అంటూ చిరంజీవి చెప్పి అందరి ముందు పరువు తీశారు. స్టేజ్‌పై నుంచే భార్య సురేఖకి ఫోన్ చేసి, తన కోట్ మిస్ అయ్యిందన్నావుగా, సుమ కొట్టేసింది, దొరికిపోతుందిలే, ఇచ్చేస్తది అని చెప్పడం హైలైట్ గా నిలిచింది.
ఈ సన్నివేశం ఆ ఈవెంట్లో బాగా పేలింది. అది ఫన్నీగా చేసినా, ఇప్పుడు మాత్రం జనాల్లోకి మాత్రం బాగా వెళ్లింది. దీంతో ఆ చిరంజీవి మాట పట్టుకుని ఆడుకుంటున్నారు. ఏ సందర్భం దొరికినా యాంకర్ సుమ పరువు తీస్తున్నారు. తాజాగా నటుడు నవదీప్ వంతు వచ్చాయి. అందరి ముందు సుమ పరువు తీశాడు.
సుమ యాంకర్‌గా చేస్తున్న షో `సుమా అడ్డా`. ఈ షోకి `లవ్ మౌలి` టీమ్ పాల్గొంది. ఇందులో నవదీప్‌తోపాటు హీరోయిన్లు, కమెడియన్ పాల్గొని నవ్వులు పూయించారు. యాంకర్ సుమ పంచులకు వారి రియాక్షన్స్, కౌంటర్లు బాగా వర్కౌట్ అయ్యాయి. ఆద్యంతం ఫన్నీగా సాగింది.
ఇందులో సుమ టాపిక్ వచ్చింది. సినిమా వాళ్లు ఏం చేసిన చివరికి పెద్దమ్మ గుళ్లో పూజలు చేస్తారు. ఆ తర్వాత సుమ వద్దకు(షోకి) వస్తారు. చివరికి ఆమె మ.. మ అనాల్సిందే అని తెలిపారు. దీనికి నవదీప్ డబ్బులతో దిష్టి తీశాడు. ఆమెకి నమస్కారం తెలియజేశాడు. ఆయనతోపాటు అందరు ఆమెకి దెండం పెట్టడం విశేషం.
అనంతరం పెద్ద బాంబ్ పేల్చాడు నవదీప్. అంతా అయిపోయాక `కాకపోతే మొన్న చిరంజీవి గారి కోటు కొట్టేయడమే నచ్చలేదు` అంటూ షాక్ ఇచ్చాడు. అంతటితో ఆగలేదు. సుమ అడ్డాలోనే చిరంజీవి కామెంట్స్ వీడియోని చూపించడం గమనార్హం. దీంతో దెబ్బకి సుమకి మైండ్ బ్లాక్ అయిపోయింది. మొహం వాడిపోయింది. ఇది షోలో బాగా పేలింది.
చిరంజీవి అప్పుడు ఏదో సరదాకి చేసిన పని కారణంగా ఇప్పుడు సుమ అందరి ముందు పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది. `సుమ అడ్డా` షో ప్రోమో చాలా ఫన్నీగా ఉంది. ఇది ఈ శనివారం ఈటీవీలో టెలికాస్ట్ కానుంది.
2024-04-17T17:30:11Z dg43tfdfdgfd