చిరంజీవి రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లారో చెప్పిన స్టార్ డైరెక్టర్.. 1993లోనే ఆ సంఘటన, ఆయన చుట్టూ ఉన్నవాళ్లే

మెగాస్టార్ చిరంజీవి జీవితం, కెరీర్ గురించి తెలియని వారు ఉండరు. అయితే కొన్ని విషయాలు మాత్రం ఆయన సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. ఖైదీ చిత్రంతో చిరంజీవి కెరీర్ మలుపు తిరిగింది.

మెగాస్టార్ చిరంజీవి జీవితం, కెరీర్ గురించి తెలియని వారు ఉండరు. అయితే కొన్ని విషయాలు మాత్రం ఆయన సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. ఖైదీ చిత్రంతో చిరంజీవి కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత చిరు వెనుదిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ శిఖరాగ్రానికి చేరుకున్నాడు ఈ క్రమంలో చిరు.. రాఘవేంద్ర రావు, కోదండరామిరెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్స్ తో కలసి పనిచేశారు. 

చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన దర్శకుడు కోదండరామిరెడ్డి. ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ తో పాటు మొత్తం 23 చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. రాఘవేంద్ర రావు, కోదండరామిరెడ్డి పోటాపోటీగా చిరంజీవితో సినిమాలు చేశారు. 

 

తాను రాఘవేంద్ర రావు గారి శిష్యుడినే కాబట్టి ఆయనకన్నా బాగా తీయాలని పోటీ పడినట్లు కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో సరదాగా కామెంట్స్ చేశారు. యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకి కోదండరామిరెడ్డి మాట్లాడుతూ తనకి చిరంజీవికి ఎలాంటి విభేదాలు లేవని.. చిన్న మనస్పర్ధ కూడా లేదని అన్నారు. ఆయన చాలా కష్టపడే వ్యక్తిత్వం ఉన్న మనిషి అని తెలిపారు. 

ఖైదీ చిత్ర సమయంలో దగ్గర్లో హోటళ్లు లేకపోవడంతో చిన్న గదుల్లో తాము చాపలు వేసుకుని పడుకున్నట్లు తెలిపారు. చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా మాట్లాడారు. చాలా మంది చిరంజీవి అప్పటికప్పుడు అనుకుని రాజకీయాల్లోకి రాలేదు. 

2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో కొన్ని నెలల ముందు పార్టీ పెట్టిన చిరు రాజకీయాల్లోకి వచ్చారు. పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. పార్టీ కొన్ని నెలల ముందు పెట్టినప్పటికీ.. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన చిరంజీవికి 1993లోనే వచ్చింది. ముఠామేస్త్రి చిత్రం చిరంజీవికి పొలిటికల్ గా మంచి ఇమేజ్ ఇచ్చింది. 

2024-06-29T10:27:28Z dg43tfdfdgfd