చిరంజీవి సినిమా అక్కడే చచ్చిపోయింది..బాబోయ్ జయసుధ రెమ్యునరేషన్ డిమాండ్లు, సీనియర్ రచయిత కామెంట్స్

చిరంజీవికి తల్లిగా ఒక హీరోయిన్ నటించాలి. నేను వెళ్లి జయసుధని అడిగాను. మదర్ రోల్ లో నటించాలా.. నేనెందుకు చేయాలి.. కుదరదు అని చెప్పింది.

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటే సినిమా గ్యారెంటీ హిట్ అనే అభిప్రాయం అప్పట్లో చిత్ర పరిశ్రమలో ఉండేది. ఫ్యాన్స్ కూడా అనుమానం అక్కర్లేదు.. ఈ సినిమా హిట్ అంటూ ఫిక్స్ అయ్యేవారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరికొన్ని చిత్రాలు మిస్ అయ్యాయి. ముందుగా కోందండ రామిరెడ్డిని దర్శకుడిగా అనుకుని ఆయన డేట్స్ కారణంగా తప్పుకున్న చిత్రాలు కూడా ఉన్నాయి. 

చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో జయసుధ ఆయనతో హీరోయిన్ గా నటించింది. ఇది కథ కాదు లాంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో పెద్దగా చిత్రాలు రాలేదు. కానీ 1995లో తెరకెక్కిన రిక్షావోడు చిత్రంలో ఎవరూ ఊహించని విధంగా చిరంజీవికి తల్లిగా జయసుధ నటించింది. ఈ చిత్రంపై సీనియర్ రచయిత, నటుడు తోటపల్లి మధు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

 

రిక్షావోడు కథ రెడీ అయ్యాక ఈ చిత్రానికి కోదండ రామిరెడ్డి డైరెక్టర్ గా అనుకున్నాం. కానీ ఆయన బిజీగా ఉండడం వల్ల కుదర్లేదు. దీనితో కోడి రామకృష్ణని తీసుకున్నాం. అక్కడే ఆ సినిమా చచ్చిపోయింది అని తోటపల్లి అన్నారు. ఆ కథకి కోడి రామకృష్ణ కరెక్ట్ కాదు అన్నట్లుగా ఆయన అభిప్రాయం చెప్పారు. కానీ కాంబినేషన్ సెట్ అయిపోయింది. ఇప్పుడు చిరంజీవికి తల్లిగా ఒక హీరోయిన్ నటించాలి. 

నేను వెళ్లి జయసుధని అడిగాను. మదర్ రోల్ లో నటించాలా.. నేనెందుకు చేయాలి .. కుదరదు అని చెప్పింది. అమ్మా 15 లక్షలు రెమ్యునరేషన్ ఇప్పిస్తా.. 5 రోజులు షూటింగ్ ఓకేనా అని అడిగా. నిర్మాత క్రాంతి కుమార్ ని నేను ఒప్పిస్తా అని చెప్పా. ఊరుకోండి ఆయనకి 5 చిత్రాలు చేస్తేనే అంత ఇవ్వలేదు నాకు.  15 లక్షలు ఎందుకు ఇస్తారు. ఇవ్వడులే అని చెప్పింది. 

వెంటనే క్రాంతి కుమార్ కి ఫోన్ చేసి జయసుధకి 15 లక్షలు ఫిక్స్ చేశా. అనుకున్నట్లుగానే నిర్మాత ఆమెకి అంత మొత్తం ఇచ్చారు. పెద్ద కాస్టింగ్ తో ఆ చిత్రం చేసినప్పటికీ అది విజయం సాధించలేదు. ఆ చిత్రానికి కోదండ రామిరెడ్డి డైరెక్టర్ అయి ఉంటే రిజల్ట్ వేరుగా ఉండేది అని అన్నారు. 

ఈ చిత్రంలో హీరోయిన్ గా నగ్మా నటించగా.. తల్లిగా జయసుధ నటించింది. చిరంజీవికి జయసుధ తల్లి ఏంటి అనే కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ ఆమె స్టార్ కావడంతో కలసి వస్తుందని అనుకున్నారు. సినిమా నిరాశపరిచింది. 

2024-05-03T04:43:37Z dg43tfdfdgfd