చిరంజీవి సినిమాల్లో మంచు విష్ణు రీమేక్ చేయాలనుకునే మూవీ అదా?.. పెద్ద సాహసమే..

మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు హీరోగా రాణిస్తున్నాడు. కన్నప్ప చిత్రం మంచు విష్ణు కెరీర్ లోనే క్రేజీ ప్రాజెక్ట్.

మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు హీరోగా రాణిస్తున్నాడు. కన్నప్ప చిత్రం మంచు విష్ణు కెరీర్ లోనే క్రేజీ ప్రాజెక్ట్. దాదాపు 100 కోట్ల బడ్జెట్ లో సొంత నిర్మాణంలో మంచు విష్ణు ఈ చిత్రాన్ని తీర్చి దిద్దుతున్నారు. 

మంచు ఫ్యామిలీ హీరో కాబట్టి మంచు విష్ణు తరచుగా వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. మంచు విష్ణు చేసే కొన్ని వ్యాఖ్యలు ట్రోలింగ్ కి కూడా కారణం అయ్యాయి. అది పక్కన పెడితే టాలీవుడ్ లో తన తండ్రితో పాటు సీనియర్ హీరోలందరూ తనకి ఆదర్శం అని మంచు విష్ణు తెలిపాడు. 

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ హీరోల చిత్రాలు కొన్ని రీమేక్ చేయాలని ఉన్నట్లు మనసులో మాట బయట పెట్టాడు. నాకు భైరవద్వీపంలో బాలకృష్ణ గారి పాత్ర అంటే చాలా ఇష్టం. ఆ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. అవకాశం ఉంటే ఆ పాత్రలో నటించాలని నా కోరిక. బాలయ్య ఆ మూవీలో అద్భుతంగా నటించారు అని విష్ణు తెలిపాడు. 

నాన్నగారి చిత్రాల్లో అల్లుడుగారు కానీ అసెంబ్లీ రౌడీ కానీ రీమేక్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. వెంకటేష్ గారి చిత్రాల్లో చంటి అంటే చాలా ఇష్టం. నాగార్జున గారి చిత్రాల్లో అందరూ గీతాంజలి అంటుంటారు కానీ.. అన్నమయ్య నెక్స్ట్ లెవెల్ మూవీ. అలాంటి పాత్ర వస్తే వదులుకోను అని విష్ణు తెలిపారు. 

ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే జగదేక వీరుడు అతిలోక సుందరి ది బెస్ట్ మూవీ అందులో డౌట్ లేదు. నాతో పాటు అందరికి ఆ మూవీ అంటే చాలా ఇష్టం. కానీ చిరంజీవి, కె విశ్వనాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలంటే పిచ్చి. ఆ మూవీస్ ఏదో ఒకటి రీమేక్ చేయాలని ఉన్నట్లు విష్ణు పేర్కొన్నారు. విశ్వనాథ్, చిరు కాంబోలో స్వయంకృషి, ఆపద్బాంధవుడు లాంటి చిత్రాలు వచ్చాయి.  విష్ణు అన్నీ క్లాసిక్ చిత్రాల పేర్లు చెప్పారు. మరి ఆ చిత్రాలని రీమేక్ చేసి ఆ స్థాయిలో మెప్పించడం అంటే మామూలు సాహసం కాదు. 

ప్రస్తుతం టెక్నికల్ గా ఎంత అభివృద్ధి చెందినా మాయాబజార్ లాంటి సినిమాని ఇప్పుడు చేయడం చాలా కష్టం అని విష్ణు అన్నారు. రచయితలు లిబర్టీ తీసుకుని ఆలోచించడం లేదు అనే దానికి మయాబజార్ ఒక ఉదాహరణ. అలాంటి ఇమాజినేషన్ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అని విష్ణు ప్రశ్నించారు. 

2024-04-20T04:30:53Z dg43tfdfdgfd