చిరంజీవిని నా తమ్ముడిగా అసలు ఊహించుకోలేను, 10 సార్లు అడుక్కున్నారు.. హీరోయిన్ క్రేజీ కామెంట్స్

గ్లామర్ పరంగా కొందరు బెస్ట్ అనిపిస్తే.. హోమ్లీ రోల్స్ లో మరికొందరు బెస్ట్ అనిపిస్తారు. 90 వ దశకంలో హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణులతో ఆమని ఒకరు. 

టాలీవుడ్ లో ఎందరో హీరోయిన్లు వస్తుంటారు.. వెళుతుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇమేజ్ వస్తూ ఉంటుంది. ఉదాహరణకి సౌందర్య, విజయశాంతి, రమ్యకృష్ణ లాంటి హీరోయిన్లని గమనిస్తే ముగ్గురికి వైవిధ్యమైన శైలి, ఇమేజ్ ఉన్నాయి. గ్లామర్ పరంగా కొందరు బెస్ట్ అనిపిస్తే.. హోమ్లీ రోల్స్ లో మరికొందరు బెస్ట్ అనిపిస్తారు. 90 వ దశకంలో హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణులతో ఆమని ఒకరు. 

 

జంబలకిడి పంబ, శుభలగ్నం, మావిచిగురు, మిస్టర్ పెళ్ళాం లాంటి సూపర్ హిట్ చిత్రాలతో ఆమని గుర్తింపు సొంతం చేసుకుంది. చాలా మంది స్టార్స్ తో కలసి నటించిన ఆమనికి కెరీర్ లో ఒక లోటు అలాగే ఉండిపోయిందట. తన డ్రీమ్  హీరో మెగాస్టార్ చిరంజీవితో నటించే ఛాన్స్ రాలేదని ఆమని అంటోంది. 

 

తాజాగా ఇంటర్వ్యూలో ఆమని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవితో రాక రాక నటించే ఛాన్స్ వస్తే అది కాస్త మరో హీరోయిన్ వల్ల చేజారిందని ఆమని తెలిపింది. రిక్షావోడు చిత్రంలో ముందుగా నన్ను ఎంపిక చేశారు. ఆ చిత్రంలో నా బెస్ట్ ఫ్రెండ్ సౌందర్య కూడా హీరోయిన్. దీనితో నాకు చాలా సంతోషంగా అనిపించింది. 

 

కానీ సడెన్ గా ఒక రోజు పేపర్ లో నగ్మాని హీరోయిన్ గా తీసుకున్నారని చదివా. మా మేనేజర్ ని అడిగితే.. అవును మేడమ్.. మనకి ఛాన్స్ లేదు. డైరెక్టర్ మారారు. అందుకే ఆమెని తీసుకున్నారు అని చెప్పాడు. ఆ చిత్రానికి ముందుగా డైరెక్టర్ కోందండ రామిరెడ్డి గారు. కొన్ని కారణాల వల్ల ఆయన మరో చిత్రానికి వెళ్లాల్సి వచ్చింది. దీనితో కోడి రామకృష్ణ గారు రిక్షావోడు చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.  ఆ విధంగా ఛాన్స్ పోయింది. 

 

దీనితో తాను వెక్కి వెక్కి ఏడ్చానని ఆమని పేర్కొంది. అది నాకు హార్ట్ బ్రేకింగ్ లాంటిది. ఆ గాయాన్ని ఇక ఏది పూడ్చలేదు. నా లైఫ్ లో అది ఒక లోటుగా ఉండిపోయింది అని ఆమని పేర్కొంది. మరో ఊహించని సంఘటన కూడా జరిగిందట. చిరంజీవికి సిస్టర్ గా నటించే అవకాశం వచ్చిందట. 

 

ఆ మూవీ మరేదో కాదు మురుగదాస్ డైరెక్ట్ చేసిన స్టాలిన్ చిత్రం. ఆ చిత్రంలో చిరంజీవికి తాను అక్కగా నటించాలి. ముందుగా నన్ను అడిగితే.. ఆయన నా డ్రీం హీరో. కలలో కూడా చిరంజీవి గారిని నా తమ్ముడిగా ఊహించుకోను.. అలాంటిది సిస్టర్ గా ఎలా చేస్తాను కుదరదని చెప్పేసిందట. పది సార్లు ఫోన్ చేసి అడుక్కున్నారు.. తాను ఒప్పుకునే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేసినట్లు ఆమని క్రేజీ కామెంట్స్ చేసింది. 

 

ఆమని స్టాలిన్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన తర్వాత ఖుష్బూని ఎంపిక చేశారు. స్టాలిన్ చిత్రంలో ఖుష్బూ, చిరు అక్కా తమ్ముడిగా నటించారు. ఆయనతో హీరోయిన్ గా ఛాన్స్ రాకపోయినా పర్వాలేదు కానీ.. సిస్టర్ పాత్రలో మాత్రం నటించను.. నా డ్రీం హీరో నా డ్రీమ్ హీరోలాగే ఉండిపోవాలి అని చిరుపై ఆమని అభిమానం చాటుకుంది. 

2024-03-28T04:43:17Z dg43tfdfdgfd