చీరలో మరింత అందంగా మెరిసిపోతున్న పంజాబీ అందం మెహ్రీన్..

Mehreen pirzada : మెహ్రీన్.. తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హను రాఘవపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. గతేడాది ఈ భామ ‘ఎఫ్ 3’ మూవీతో మరో సక్సెస్ అందుకుంది. కానీ ఈ సినిమా సక్సెస్ అయినా.. ఈ భామకు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. Photo : Instagram
అది అలా ఉంటే మెహ్రీన్‌కు సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించింది. హాట్ స్టార్ కోసం ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ వెబ్ సిరీస్‌లో మెహ్రీన్ నటించింది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో ఆమె చాలా బోల్డ్ గా నటించిందన్న విమర్శలు వచ్చాయి. Photo : Instagram
అయితే ఆ విమర్శలపై.. బోల్డ్ సీన్స్‌పై క్లారిటీ కూడా ఇచ్చింది.  ఆమె ఆ సీన్స్ గురించి మాట్లాడుతూ.. అది మ్యారిటల్ రేప్ అని.. భార్యకు ఇష్టం లేకున్నా భర్త ఫోర్స్ చేయడం మ్యారిటల్ రేప్ గా పేర్కొంటారని వివరణ ఇచ్చింది. అయితే కొన్ని మీడియా వర్గాలు మాత్రం దాన్ని సెక్స్ సీన్లుగా అభివర్ణించడం చూసి బాధపడ్డానని పేర్కోంది.
మ్యారిటల్ రేప్‌గా చూపించిన సీన్స్‌ను శృంగార సన్నివేశాలని ఎలా అంటారని మెహ్రీన్ మండిపడింది. దీనికి సంబంధించిన ట్విట్టర్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మెహ్రీన్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. బోలెడంత గ్లామర్ ఉన్న.. మెహ్రీన్‌కు హీరోయిన్‌గా ఇంకా బిగ్ బ్రేక్ రాలేదనే చెప్పాలి. ఇప్పటికే మీడియం రేంజ్ సరసన నటిస్తూ కాలక్షేపం చేస్తోంది. ఇక ఎఫ్ 2లో హనీగా ఈమె చేసిన అల్లరిని ఎవరు మరిచిపోలేరు.  Photo : Instagram
ఇక మెహ్రీన్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. బోలెడంత గ్లామర్ ఉన్న.. మెహ్రీన్‌కు హీరోయిన్‌గా ఇంకా బిగ్ బ్రేక్ రాలేదనే చెప్పాలి. ఇప్పటికే మీడియం రేంజ్ సరసన నటిస్తూ కాలక్షేపం చేస్తోంది. ఇక ఎఫ్ 2లో హనీగా ఈమె చేసిన అల్లరిని ఎవరు మరిచిపోలేరు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ మూవీ మెహ్రీన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.  మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు' సినిమా  కూడా బాగానే అలరించింది.  ఇక ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్2' , ‘ఎఫ్ 3’ మూవీల్లో నటించి అదరగొట్టింది.  Photo : Instagram
ఇక మెహ్రీన్ కౌర్ పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె 5 నవంబర్ 1993లో పంజాబ్ రాష్ట్రంలోని భటిండాలో జన్మించింది. ఈమె తమ్ముడు కూడా మోడల్ నటుడు. అంతేకాదు చిన్నపుడే మోడలింగ్‌లో అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత నటిగా మారింది. మెహ్రీన్ కౌర్ తెలుగుతో పాటు తమిళ, హిందీ, పంజాబీ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఫోటోలను బాగా పంచుకుంటుంది.  Photo : Instagram
ఆ మధ్య హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడు భవ్య బిష్ణోయ్‌తో జరిగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో వీరిద్దరు పెళ్లి చేసుకోవడం లేదంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో ఫుల్లు బిజీగా ఉంది.  Photo : Instagram
ఇక మెహ్రీన్ కౌర్ వీలు చిక్కినపుడల్ల అందాల ప్రదర్శనతో రెచ్చిపోతుంది. అంతేకాదో సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. త్వరలో ఈ భామ బడా హీరోల సరసన నటించబోతుంది. ప్రస్తుతం ‘స్పార్క్ అనే సినిమా చేస్తోంది. దాంతో పాటు కన్నడలో తొలిసారి తన లక్ పరీక్షించుకోంటోంది. ఈ రెండు సినిమాల ఫలితంపై మెహ్రీన్ చాలా ఆశలే పెట్టుకుంది.  Photo : Instagram
ఈ భామకు బాలయ్య బాబీ కాంబినేషన్‌లో వస్తున్న  సినిమాలో  అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.  ఈ సినిమా విషయమై త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో సోనాక్షి సిన్హాను  అనుకున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.. అయితే  మెహ్రీన్‌కు మాత్రం  ఇప్పటికీ మంచి బ్రేక్  కోసం ఎదురు చూస్తోంది. Photo : Instagram

2024-03-29T13:16:34Z dg43tfdfdgfd