ఛీ నీ బతుకు!.. నెటిజన్‌కు కలర్స్ స్వాతి కౌంటర్

బుల్లితెరపై కలర్స్ అనే ప్రోగ్రాం నుంచి గత ఏడాది వచ్చిన మంత్ ఆఫ్ మధు వరకు కలర్స్ స్వాతి ప్రయాణం అందరికీ తెలిసిందే. మధ్యలో సినీ లైఫ్‌కు గ్యాప్ ఇచ్చి పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టింది. అయితే ఆమె తన భర్తకు దూరంగా ఉంటోందని, విడాకులు తీసుకుందనే రూమర్లు మాత్రం ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఈ విషయం మీద మాత్రం స్వాతి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇవన్నీ ఇలా ఉంటే.. గత ఏడాది వచ్చిన మంత్ ఆఫ్ మధు, సత్య ఫీచర్ సాంగ్‌లతో స్వాతి బాగానే ట్రెండ్ అయింది.

ఇక తాజాగా కలర్స్ స్వాతి తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేసింది. ఈ మేరకు ఇన్ స్టా స్టోరీలో వీడియోలను షేర్ చేసింది. ఈ వీడియోకి ఓ ఆకతాయి నెటిజన్ కాస్త నెగెటివ్ కామెంట్ చేశాడు. ఛీ నీ బతుకు అని రిప్లై ఇచ్చాడు. ఆ కామెంట్‌కు కలర్స్ స్వాతి రిప్లై ఇచ్చింది. నాక్కూడ కొన్ని సార్లు అలానే అనిపిస్తుంది.. నాక్కూడ కొన్ని సార్లు అలానే అనిపిస్తుంది.. జీరో పోస్ట్‌ ఛాంపియన్స్ అంటూ కౌంటర్లు వేసింది.

కలర్స్ స్వాతి ఇలా ఫన్నీగా కౌంటర్లు వేస్తుంటుంది. ఘాటుగానూ రిప్లైలు ఇస్తుంటుంది. మంత్ ఆఫ్ మధు టైంలో నెగెటివ్ రివ్యూల మీద స్వాతి బాగానే మండి పడింది. సినిమా పట్ల నెగెటివ్ కామెంట్లు, నెగెటివ్ రివ్యూలు ఇవ్వడంతో హర్ట్ అయినట్టుగా ఉంది. అయితే స్వాతి తన సినిమా మీద, తన నటన మీద నెట్టింట్లో వచ్చిన కొన్ని పాజిటివ్ కామెంట్లను చూసి ఫుల్ ఖుషీ అవుతూ ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ ఉండేది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T05:58:54Z dg43tfdfdgfd