జోరుగా ప్రచారం సాగిస్తున్న కలవపూడి శివ.. ఇక్కడ అదే హాట్ టాపిక్ !

ఈయన ఒక మాజీ ఎమ్మెల్యే. ప్రధాన పార్టీ తరపున టికెట్ ఆశించారు. కానీ నిరాశే ఎదురైంది. ఇక చేసేదేమీలేక స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అసలే మాజీ ఎమ్మెల్యే కాబట్టి, ప్రజలు ఈయనకు ప్రచారపర్వంలో బ్రహ్మరథం పడుతున్నారట.

ఏపీలో సాధారణ ఎన్నికల పుణ్యమా అంటూ పొలిటికల్ హీట్ ఎక్కింది. అసలే సమ్మర్ హీట్.. ఆపై పొలిటికల్ హీట్ అంతా హీట్ హీట్ గా మారింది ఏపీ. అయితే రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం లో ఈ హీట్ కాస్తంత అధికంగా ఉందట. దీనికి ప్రధాన కారణం ఇక్కడ బరిలో నిలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులే. కొందరు ప్రధాన పార్టీల తరఫున ఎన్నికల బరిలో ఉండగా, మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా సైతం నామినేషన్లు సమర్పించి ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇలా స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్న వారిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ నిలిచారు.

ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులు బలమైన నేతలు కావడంతో, వారికి ధీటుగా స్వతంత్ర అభ్యర్థి శివ జోరు ప్రచారాన్ని సాగిస్తున్న పరిస్థితి నియోజకవర్గంలో ఉందని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. కలవపూడి శివ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పిలిస్తే పలుకుతా అనే రీతిలో ఉండే వారని ఇక్కడ నానుడి. అందుకేనేమో ప్రధాన పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీని ఇచ్చే రీతిలో శివ నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు.

Tour: భూగర్భంలో 800 మీటర్ల లోతు సొరంగమార్గంలో గుహలు.. అదిరే టూరిస్ట్ ప్లేస్, మిస్ అవ్వొద్దు!

ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన శివ నియోజకవర్గ పట్టు ఉన్న నేతగా ప్రజలు భావిస్తారు. కాగా.. నామినేషన్ వేసిన సమయం నుండే కలవపూడి శివ ప్రచార పర్వాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఈయన ప్రచార పర్వం సైతం భిన్నంగా కొనసాగిస్తూ.. ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తనను గెలిపిస్తే చాలు గతంలో చేసిన అభివృద్దిని మించి మరింత అభివృద్ది పథంలోకి నియోజకవర్గాన్ని నడిపిస్తానని ఓటర్లకు శివ హామీ ఇస్తున్నారు.

2 నిమిషాల్లో రూ.5 లక్షలు లోన్.. ఫోన్‌పే వాడే వారికి గుడ్ న్యూస్!

వ్యవసాయ పనులు చేసే రైతులను ఆప్యాయంగా పలకరిస్తూ.. మార్కెట్ లలో వ్యాపారులు, వ్యవసాయ కూలీలు , ఇలా వాడవాడనా అందరినీ పలకరిస్తూ ప్రచారపర్వంలో జోరు పెంచారు శివ. ఉండి నియోజకవర్గం పై తనకు ఉన్న పట్టుతో ఎలాగైనా విజయం సాధించాలని, ఎండను సైతం లెక్కచేయక.. నిరంతర ప్రచార ధోరణి తో సాగుతుందట ఈయన ప్రచార శైలి. ఏది ఏమైనా మాజీ ఎమ్మెల్యే అయిన కలవపూడి శివ.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇస్తున్నారని ప్రజల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి.

2024-05-05T11:26:57Z dg43tfdfdgfd