‘టిల్లు’ గాడి రూట్లో ‘మ్యాడ్’.. సితార సెంటిమెంట్ కలిసొస్తుందా?

సితార సంస్థకు బాగానే కలిసి వస్తోంది. వరుసగా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లు అవుతుండటంతో సితార బ్యానర్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సార్, డీజే టిల్లు, మ్యాడ్, టిల్లు స్క్వేర్ ఇలా అన్నీ కూడా సూపర్ హిట్లే. దీంతో ఇప్పుడు సితార బ్యానర్ స్పీడు పెంచేసినట్టుగా కనిపిస్తోంది. టిల్లు స్క్వేర్ అయితే వంద కోట్ల గ్రాస్ మార్క్ ఎప్పుడో దాటేసింది. 150 కోట్లకు పరుగులు తీస్తోంది. అయితే ఇప్పుడు స్క్వేర్ సెంటిమెంట్‌ను సితార ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తోంది.

టిల్లు స్క్వేర్ హిట్ అవ్వడంతో మ్యాడ్ సీక్వెల్‌ను కూడా అదే కోవలో వచ్చేలా టైటిల్ పెట్టారు. మ్యాడ్ సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. టిల్లు స్క్వేర్ సక్సెస్‌తో ఈ మూవీని చకచకా ఫినిష్ చేయాలని ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. ఈ సీక్వెల్‌కు మ్యాడ్ స్క్వేర్ అని టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

2023 అక్టోబరులో 'మ్యాడ్' చిత్రం విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్‌'ని రూపొందిస్తున్నారు. మ్యాడ్'తో రచయిత, దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకర్ 'టిల్ స్క్వేర్‌'కి రచయితలలో ఒకరిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్‌'తో మళ్లీ హిట్టు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ల త్రయం ఈ సీక్వెల్ కోసం మళ్ళీ రంగంలోకి దిగారు. కథానాయికల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. మ్యాడ్ ఎంతలా నవ్వులు పంచిందో, దానికి రెట్టింపు వినోదం సీక్వెల్ ద్వారా అందించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. భీమ్స్ సిసిరోలియో మళ్లీ ఈ చిత్రానికి అదిరిపోయే పాటలు ఇవ్వనున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-19T11:10:27Z dg43tfdfdgfd