టెన్త్ క్లాస్ రిజల్ట్స్ : నిర్మల్ టాప్.. వికారాబాద్ లాస్ట్

టెన్త్ క్లాస్ రిజల్ట్స్ : నిర్మల్ టాప్.. వికారాబాద్ లాస్ట్

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఫలితాలు రిలీజయ్యాయి. ఏప్రిల్ 30 మంగళవారం రోజు ఉదయం 11 గంటలకు  విద్యాశాఖ ఉన్నాతాధికారులు ఫలితాలను విడుదల చేశారు.  పదో తరగతి పరీక్షలు ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.  ఓవరాల్ గా  91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 

ఇందులో  89.42 శాతం బాలురు,  93.23 శాతం బాలికలు ఉత్తీర్ణత  సాధించారు.   99 శాతం ఫలితాలతో నిర్మల్ జిల్లా టాప్ లో నిలువగా,  65.10 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ చివరి స్థానంలో నిలిచింది.  3 వేల 927స్కూల్స్ లో  విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు.  ఆరు స్కూల్స్ లో జీరో ఉత్తీర్ణత శాతం నమోదైంది.  

రాష్ట్రంలో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించగా.. మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.  వీరిలో బాలురు 2,7,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పరీక్షలు జరుగుతుండగానే.. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు 19 కేంద్రాల్లో పరీక్ష పేపర్ల మూల్యాంకనం జరిగింది.

  ©️ VIL Media Pvt Ltd.

2024-04-30T05:52:07Z dg43tfdfdgfd