తండేల్ నుంచి ఆకట్టుకుంటోన్న సాయి పల్లవి స్పెషల్ వీడియో..

నాగ చైతన్య (Naga Chaitanya Akkineni) ఇటీవల ‘కస్టడీ’ (Custody) మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటించింది. ట్రైలర్ అండ్ టీజర్స్‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసిన కస్టడీ  మే 12న తెలుగుతో పాటు తమిళ్‌లో ఒకేసారి విడుదలై  డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆయన కాస్తా గ్యాప్ తీసుకుని ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే ఓ భారీ ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు. సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా చేస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా నుంచి తాజాగా మరో వీడియో విడుదలైంది. ఈరోజు సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. వీడియో మాత్రం మంచి ఏమోషన్స్‌తో ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 20, 2024న థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇండియన్ ఫిషన్ మెన్‌ను పాకిస్తాన్ అధికారులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత వారు ఎలా అక్కడినుంచి బయటకు వచ్చారనేది ప్రధానంగా చర్చించనున్నారట. ప్యాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకోనుందో చూడాలి.

ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య.. గుజరాత్ సముద్రతీర జలాల్లో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి పాత్రలో కనిపించనున్నారు.

ఇక నాగచైతన్య సినిమాలతో పాటు దూత అనే ఓ వెబ్ సిరీస్‌లో నటించాడు. దూత వెబ్ సిరీస్ డిసెంబర్ 1, 2024 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. సూపర్ నాచురల్ హారర్ కథతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌కు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్‌ను శరద్ మరార్ నిర్మించారు.

2024-05-09T06:24:56Z dg43tfdfdgfd