తపోవన ఆశ్రమంలో ఘనంగా ఆంజనేయస్వామి జయంతోత్సవాలు

తెలుగు రాష్ట్రాలనే కాదు.. దేశంలోనే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఆ పరమ పవనమైన పీఠం విరాజిల్లుతూ ఉంది. ఆ పీఠానికి అనుబంధంగా ఉన్న పీఠంలో తెలుగు రాష్ట్రంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాల సైతం నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఆంజనేయస్వామి జయంతి సందర్భంగా ఆ ఉమ్మడిజిల్లాలో ఉన్న ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతులు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఉత్సవాల జరిగాయి. ఆ విశేషాలు ఒకసారి వీక్షిద్దాం.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా శృంగేరి పీఠం అంటే ఒక ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అటువంటి శృంగేరి పీఠంకు అనుబంధంగా ఉన్న శ్రీ సచ్చిదానంద తపోవన ఆశ్రమం తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక కేంద్రంగా విరజులుతుంది. అటువంటి దివ్యపీఠంలో ఆంజనేయ స్వామివారి జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా తపోవన ఆశ్రమ పీఠాధిపతులు శ్రీసచ్చిదానంద సరస్వతి స్వామీజీ నేతృత్వంలో ఘనంగా జరిగాయి.

విధి వక్రీకరించినా తలవంచని విక్రమార్కుడు.. అమర్ సాయినాధ్..!!

తపోవన ఆశ్రమంలో గణపతి స్వామి సుబ్రహ్మణ్యస్వామి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు దత్తాత్రేయ స్వామి ఈశ్వర లింగ స్వరూపం ఆంజనేయ స్వామి అతిపెద్ద విగ్రహం గోసాల వేద పాఠశాల అతి పవిత్ర పరమ పావన నేలలో కలిగి ఉన్నాయి. లోక కళ్యాణార్థం ప్రజలందరూ బాగుండాలని పుషు పక్షాధులు బాగుండాలని ఏడాది పొడువునా ఈ రాష్ట్రంలో ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ నేతృత్వంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.

పేదరికం అడ్డు రాలేదు..! శభాష్ యోగి..!

ఇక ఆంజనేయస్వామి జయంతి సందర్భంగా ఆశ్రమంలో గల ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహం వద్ద వేద పండితులు వేద విద్యార్థులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దివ్య మంగళ స్వరూపానికి తమరలపాకలతో ప్రత్యేక అర్చన నిర్వహించి సింధూరం సమర్పించి పంచహారతులు వేద పండితులు శ్రీ ఆంజనేయ స్వామికి అందజేశారు. మరొపక్క సరస్వతి స్వామీజీ పంచముఖ ఆంజనేయస్వామికి సింధూరంతో అర్చన నిర్వహించి ప్రత్యేక హారతులు అందజేశారు.

ఎక్కడ స్వామివారి నామస్మరణజరుగుతుందో అక్కడ శాంతి తాండవిస్తుందని ప్రతి ఒక్కరు ఆంజనేయసుతుని ఆరాధించాలని సరస్వతి స్వామీజీ అక్కడికి వచ్చిన భక్తులందరికీ అనుగ్రహబాషనం చేసారు. వేద విద్యార్థులు సైతం ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ ఆశ్రమంలో గోశాల అదేవిధంగా పచ్చని చెట్లు పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ ఆశ్రమంలో ప్రధానంగా వేద విద్యార్థులను మంత్రఘోష తో ఆధ్యాత్మికం వెల్లువిరుస్తుంది సరస్వతి స్వామీజీ అదే విధంగా వేద పండితులు నిర్వహించే ప్రతి పూజా కార్యక్రమంలో ఈ వేద విద్యార్థులు పాల్గొంటూ ఉంటారు. ప్రధానంగా స్వామి వారికి లేక అమ్మవారికి హారతి ఇచ్చే సమయంలో వీరు మోగించే శంకర్ శబ్దాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటాయి.

2024-04-24T06:12:46Z dg43tfdfdgfd