తప్పులు పెద్దగా.. నిజాలు చిన్నగానా : రాందేవ్ పై యాడ్స్ పై సుప్రీంకోర్టు అసహనం

తప్పులు పెద్దగా.. నిజాలు చిన్నగానా : రాందేవ్ పై యాడ్స్ పై సుప్రీంకోర్టు అసహనం

పతంజలి ఆయుర్వేదం సంస్థ యాజమాన్యలు రామ్ దేవ్ బాబా, మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణలపై సుప్రీం కోర్టు మరోసారి ఫైర్ అయ్యింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో బహిరంగ క్షమాపణలు చెబుతూ దినపత్రికల్లో యాడ్స్ ఇచ్చామని యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ మంగళవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అయితే సుప్రీం కోర్టు ఈ యాడ్స్ పై అసహనం వ్యక్తం చేసింది. సంస్థలో ఇచ్చే యాడ్స్ సైజులోనే క్షమాపణల యాడ్ ఇచ్చారా అని ప్రశ్నించింది.   

పతంజలి సంస్థ తరుపు న్యాయవాది రోహత్గీ  వాదిస్తూ.. 67 పత్రికల్లో యాడ్స్ ఇచ్చామని, అందుకోసం కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు కోర్టుకు వెల్లడించారు. న్యాయవాది వాదనలు విన్న జస్టిస్ హిమా కోహ్లీ అసహనం వ్యక్తం చేశారు.  ‘‘క్షమాపణలను ప్రముఖంగా ప్రచురించారా? గతంలో ఉత్పత్తుల యాడ్‌లలో ఉపయోగించిన ఫాంట్‌నే వాడారా? అదే సైజ్‌లో క్షమాపణలను పబ్లిష్‌ చేశారా?’’ అని ప్రశ్నించారు. 

 న్యాయవాది స్పందిస్తూ  పెద్ద పరిమాణంలో మరోసారి క్షమాపణలు యాడ్ ఇస్తామని రోహత్గీ కోర్టుకు తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-23T08:55:21Z dg43tfdfdgfd