తల్లి పడ్డ కష్టానికి ఫలితం...ఈ విద్యార్థి సాధించిన మార్క్స్..

తండ్రి చిన్నతనంలోనే మృతి..తల్లి అనేక కష్టాలు పడుతూ..కూతురుని చదివిస్తుంది.ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఎంత GPA సాధించింది. ఆ విద్యార్థి ఎవరు.. జీవిత లక్ష్యం ఏంటి అనే అంశాలను లోకల్18 ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..!

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన లోహిత అనే విద్యార్థిని తండ్రి చిన్నతనంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటినుంచి తన తల్లి అనేక కష్టనష్టాలు కోర్చుకొని కూతురు లోహితను చదివిస్తోంది. ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో తల్లి కష్టాన్ని నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. కష్టానికి ప్రతిఫలంగా 9.0 GPA గ్రేడ్ మార్క్స్ సాధించి అందరి ప్రశంసలు మన్నలను అందుకుంటుంది. వేములవాడ డి.ఎస్.పి నాగేంద్ర చారి సైతం విద్యార్థులను అభినందించి స్వీట్స్ పంపిణీ చేశారు. మరింత అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

లోహిత లోకల్18తో మాట్లాడుతూ.. తన చిన్నతనంలోనే తండ్రి మృతి చెందడంతో తల్లి కష్టపడి తనను చదివిస్తుందని భావోద్వేగానికి లోనైంది. ఉన్నత చదువులు చదివి గొప్ప డాక్టర్ కావాలనే తన జీవిత ఆశయమని, డాక్టర్ అయిన తర్వాత తన తల్లి కష్టాన్ని తీర్చి.. సంతోషంగా చూసుకుంటానని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. మనం కూడా చిన్నారి లోహిత తన లక్ష్యాన్ని చేరుకొని తన కష్టాలను తన తల్లి కష్టాలను అధిరోహించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేజీబీవీ వేములవాడ అర్బన్ లో 100 శాతం పదవ తరగతి ఉత్తీర్ణత సాధించడం పట్ల జిల్లా ఉన్నతాధికారులు,ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులపై పెట్టుకున్న నమ్మకాన్ని మమ్ము చేయకుండా అత్యుత్తమ ఫలితాలు రావడం చాలా సంతోషంగా ఉందని టీచర్స్ అంజలి,సంపూర్ణ తెలిపారు.

ఈ రామారావు నాదస్వర రాగాలను పది మందికి పంచేస్తున్నారు.. మీరే చూడండి..

ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక స్టడీ అవర్స్ తో పాటు పౌష్టిక నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు కూడా తన కూతురు లోహితను ఎంతగానో ప్రోత్సహిస్తూ.. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేశారని ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నానని లోహిత తల్లి తెలిపారు. కేజీబీవీ లో నాణ్యమైన విద్యాభ్యాసాన్ని అందిస్తున్నారని,విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కేజీబీవీ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

కేజీబీవీ పాఠశాలలోని విద్యార్థులకు కల్చరల్ యాక్టివిటీస్ గేమ్స్,కాంపిటీటివ్ ఎగ్జామ్స్, ప్రత్యేకమైన గైడెన్స్ను అందిస్తూ.. అనునిత్యం మంచి ఫలితాలు సాధించేందుకు ప్రోత్సహిస్తారని విద్యార్థులు చెబుతున్నారు. తాను 10 GPA వస్తుందని ఆశించానని,కాకపోతే తనకు.9.0 GPA కూడా సంతోషంగానే ఉందని విద్యార్థిని లోహిత లోకల్18 కి వివరించారు.

2024-05-06T07:30:02Z dg43tfdfdgfd