తాతా.. ! నీకు టాటా..!! బీజేపీపై కాంగ్రెస్ నుంచి మరో వీడియో రిలీజ్

తాతా.. ! నీకు టాటా..!! బీజేపీపై కాంగ్రెస్ నుంచి మరో వీడియో రిలీజ్

హైదరాబాద్, వెలుగు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయాలను రాష్ట్ర కాంగ్రెస్ వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళుతున్నది. అందులో భాగంగా బీజేపీని విమర్శిస్తూ తాజాగా మరో వీడియోను విడుదల చేసింది. ఇందులో ప్రధాని మోదీని ఉద్దేశించి “ పదేండ్లు తెలంగాణకు ద్రోహం చేసింది చాలు.. తాతా..! నీకు టాటా..!! ”  

అంటూ రూపొందించిన వీడియో వైరల్ గా మారింది.   విభజన చట్టాల అమలులో వైఫల్యం, వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో నిర్లక్ష్యం, 2020 లో హైదరాబాద్ వరద బాధితులకు కేంద్రం ఎలాంటి సాయం అందించకపోవడం, ఐటీఐఆర్ లాంటి అనేక అంశాల్లో తెలంగాణకు బీజేపీ అన్యాయం చేసిందని వీడియోలో పేర్కొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T03:07:25Z dg43tfdfdgfd