తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్

తిరుమల శ్రీవారిని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామి వారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో పాల్గొని వీవీఎస్ లక్ష్మణ్ మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల వేద ఆశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

వీవీఎస్ లక్ష్మణ్ టీమ్ ఇండియా తరఫున అనేక సిరీస్ లు ఆడి టీమ్ ఇండియాను విజయపథంలో నడిపారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై టీమ్ సత్తా చాటిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నారు లక్ష్మణ్ . 137 టెస్టులు ఆడిన వీవీఎస్ లక్ష్మణ్ 8,781 పరుగులు చేశారు. ఇక 17 సెంచరీలు., 56 హాఫ్ సెంచరిలు సాధించి తన రికార్డ్ నెలకొల్పారు. 1996 అహ్మదాబాద్ లో దక్షిణ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ తో ఇంటర్నేషనల్ కెరీర్ ను తొలుత లక్ష్మణ్ ప్రారంభించారు.

అరుణాచల గిరిప్రదక్షిణకు ప్రత్యేక బస్సులు... రూట్, ఛార్జీల వివరాలివే

ఇక ..।

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.

ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండవరోజు ఏప్రిల్ 22న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.

ఈ నృత్యాలకు ఈ జిల్లాలో ఎందుకు అంత ఆదరణ .. తెలుసుకుందామా !

చివరిరోజు ఏప్రిల్ 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.

2024-04-20T05:05:34Z dg43tfdfdgfd