తెలంగాణ నుంచి ముగ్గురికి పద్మశ్రీ

తెలంగాణ నుంచి ముగ్గురికి పద్మశ్రీ

తెలంగాణ నుంచి ముగ్గురు పద్మ శ్రీ అవార్డులను అందుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రముఖ కవి కూరెళ్ల విఠలాచార్య రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు స్వీకరించారు. ఆలయ నిర్మాణ కళలో శిక్షణ పొందిన వేలు ఆనందాచారి, తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక మహిళ, ఒకేఒక్క సంస్కృత భాగవతారిణి దాలిపర్తి ఉమామహేశ్వరికీ పద్మశ్రీ అవార్డులు అందజేశారు. అలాగే, ఈ ఏడాది కళా రంగంలో రాజస్థాన్  నుంచి అలీ మహ్మద్, గనీ మహ్మద్​లు జంటగా ఒకే అవార్డును అందుకున్నారు. వారితో పాటు తమిళనాడు కు చెందిన భద్రప్పన్, చత్తీస్​గఢ్ కు చెందిన రామ్ లాల్ భరెట్, అస్సాం నుంచి పార్వతీ భరువా, హిమాచల్ ప్రదేశ్​కు చెందిన సోమ్ దత్తా భట్టు, కేరళ నుంచి సత్త నారాయణ బెలెరీ, బిహార్ కు చెందిన అశోక్  కుమార్  బిశ్వాస్, త్రిపురకు చెందిన శ్రుతిరేఖ చక్మా, గుజరాత్ కు చెందిన రఘువీర్ చౌదరి, అండమాన్  నికోబార్  నుంచి చెల్మల్ కు పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. 

ఇక క్రీడా రంగం నుంచి తమిళనాడుకు చెందిన జోష్నా చిన్నప్ప, యోగా విభాగంలో విదేశానికి చెందిన చార్లెట్  షోపిన్, మహారాష్ట్ర  నుంచి ఉదయ్ విశ్వనాథ్  దేశ్ పాండే, చంద్రశేఖర్, ఉత్తరప్రదేశ్  నుంచి రాధాకృష్ణ, రాజారాం జైన్, గౌరవ్ ఖన్నా, కర్నాటక నుంచి అనుపమా హోస్కేరే, మాకమ్ కృష్ణ మూర్తి, బెంగాల్  నుంచి రతన్  కాహార్, సిక్కిం కుచెందిన జోర్ దెన్ లెచ్చ, ఒడిశాకు చెందిన వినోద్ మహారాణా, బిహార్  నుంచి రాంకుమార్ మల్లిక్  తదితరులు ఈ అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి భార్య సురేఖ, ఆయన కొడుకు రామ్‌చరణ్‌, -ఉపాసన దంపతులు పాల్గొన్నారు. కాగా, ఏపీ నుంచి చిరంజీవికి కేంద్రం ఈ అవార్డుకు ఎంపిక చేసింది.

©️ VIL Media Pvt Ltd.

2024-05-10T02:06:38Z dg43tfdfdgfd