థియేటర్‌లో సినిమా ప్రదర్శనకు జరిగే తీరు ఇదే!

ప్రస్తుత ఆధునిక కాలంలో సినిమాలు చూడని వారు అంటూ ఎవరు ఉండరు.  ఈ నేపథ్యంలో అసలు సినిమా తెర మీదకి ఏ విధంగా వస్తుంది.  గతంలో చూసుకున్నట్లయితే రీల్స్ ద్వారా ఉండేది.  కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో ఏ విధంగా థియేటర్లలో ఏవిధంగా సినిమాలను ప్రదర్శిస్తున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్ ఆపరేటర్ సురేష్ , లోకల్ 18 తో సినిమా ప్రదర్శనకు సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు
వివరాల్లోకెళ్తే.. గత 30 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర థియేటర్ లో పనిచేస్తున్నట్లు తెలిపారు. గతంలో థియేటర్ రీల్స్ ద్వారా నడుస్తుండేవని , కానీ ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రొజెక్టర్ ద్వారా సినిమా ప్రదర్శన సాగుతుందన్నారు .
ఏ సినిమా ఇప్పుడు సినిమా ఎన్ని గంటలు ఉంది, ముందే డిస్ ప్లే  అవుతుందన్నారు.  సినిమా మొదటి భాగం అదేవిధంగా రెండో భాగం ఎన్ని గంటలు ఉందనేది నేటి ప్రొజెక్టర్ మనకు సులభరీతిలో కనిపిస్తుందన్నారు. ప్రస్తుతం అయితే సినిమా మొత్తం హార్డ్ డిస్క్ లోనే ఉంటుందని,  అదేవిధంగా ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ శాటిలైట్ సినిమాలు కాబట్టి  ఇంజనీరు వచ్చి ఏదైనా సినిమా రిలీజ్ అయితే మనం కొనుగోలు చేస్తే లోడ్ చేసి లైసెన్స్ ఇచ్చి వెళ్తారన్నారు. ఆ సినిమా ఎన్ని రోజులు నడిపించేది థియేటర్ యజమాని పైన ఆధారపడి ఉంటుందన్నారు.  అదేవిధంగా ఒకరోజు కూడా కొనుగోలు చేయొచ్చని,  లేదంటే ఒక వారం కూడా చేయవచ్చన్నారు.
ప్రస్తుతం ఆధునిక కాలంలో పెద్దగా రిపేర్లు వచ్చే పరిస్థితి సినిమా థియేటర్ల ప్రొజెక్టర్లకు లేదని, ఒకవేళ వస్తే ఆడియో కార్డు, వీడియో కార్డు వస్తుంటాయన్నారు.  గతంలో మిషన్ల రీల్స్ ద్వారా ప్రదర్శన జరిగే సమయంలో  చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు తమ ఆపరేటర్ల పని చాలా సులువుతరంగా ఉందన్నారు .

2024-03-28T09:59:01Z dg43tfdfdgfd