నమ్మలేని నిజం : EMI కట్టలేకపోవటంతో షారూఖ్ కారు తీసుకెళ్లిపోయారు

షారూఖ్ ఖాన్ తన కారుకు ఇనిస్టాల్మెంట్ కట్టకుండా ఫెయిల్ అయ్యాడు.  అప్పట్లో షారూఖ్ కు సొంత ఇల్లు అనేది ముంబైలో లేదు. 

ఆ మధ్యన కాస్త వెనకబడ్డా ఇప్పుడు షారూఖ్ ఖాన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసారు. ఆయన  నటించిన ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలు వసూళ్ల పరంగా ఎన్నో రికార్డులు సృష్టించాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నటుల్లో షారుక్ ఖాన్ కూడా ఒకరిగా ఎదిగారు. తన కెరీర్‌లో దాదాపు 36 ఏళ్లు పూర్తయ్యాయి. అతను ‘జీరో’ నుండి బాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోగా జర్నీని పూర్తి చేయటం మామూలు విషయం కాదు. షారుఖ్ ఖాన్ కు ఈ స్దాయికు వెళ్లినా ప్రతీ పైసా లెక్కే. ఇక అంతటి షారూఖ్ ఖాన్ కు కూడా ఓ టైమ్ లో ఈఎమ్ ఐ కట్టపోతే కారు తీసుకెళ్లిపోయారు. ఆ విషయం మీకు తెలుసా

 

ఈ ఇంట్రస్టింగ్ విషయాన్ని తెలియచేసింది జూహీ ఛావ్లా. షారూఖ్ ఖాన్, జూహీ ఛావ్లా బాగా క్లోజ్ ప్రెండ్స్. కెరీర్ ప్రారంభం రోజుల్లో ఇద్దరి కలిసి పనిచేసి ఎన్నో హిట్స్ ఇచ్చారు. ఇప్పటికీ వీళ్లద్దరి మధ్యా ఆ స్నేహ బంధం అంతే గాఢంగా కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో గుజరాత్ లో జరిగిన ఓ ఈవెంట్ లో జూహీ ఛావ్లా..షారూఖ్ ఖాన్ ప్రారంభం రోజులను గుర్తు చేసుకుంది. అప్పట్లో అవమానాలు, అప్పులు, ఈఎమ్ ఐ లు ఎన్ని ఉన్నా ఆనందకరమైన రోజులు అంది.

ఓ టైమ్ లో షారూఖ్ ఖాన్ తన కారుకు ఇనిస్టాల్మెంట్ కట్టకుండా ఫెయిల్ అయ్యాడు.  అప్పట్లో షారూఖ్ కు సొంత ఇల్లు అనేది ముంబైలో లేదు. రాజు బన్ గయా జెంటిల్మెన్ షూటింగ్ టైమ్ లో ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడే తన మకాం అన్నట్లుండేవాడు. అతనికోసం ప్రత్యేకమైన వంటవాడు, క్యారేజీలు లేవు. అతను ఎక్కడ ఉండేవాడో ఎవరికీ తెలిసేది కాదు. యూనిట్ లోనే టీ,టిఫెన్, భోజనం కొట్టుకుపోయేవి. 

అప్పుడు అతనికి ఓ సెకండ్ హ్యాండ్ జిప్సీ కారు ఉండేది. అదీ ఈఎమ్ ఐ లో కొన్నది. ఓ సారి పేమెంట్స్ టైమ్ కు రాక ఇనిస్టాల్మెంట్  కట్టలేకపోయారు. వాళ్లు కారు తీసుకెళ్లిపోయారు. సెట్ లో చాలా డల్ గా ఉన్నాడు. విషయం తెలిసి నేను ఓదార్చాను. భవిష్యత్తులో నీకు బోలెడు సొంత కార్లు ఉంటాయి అన్నారు. అదే నిజమైంది. ఈ రోజు చూడండి షారూఖ్ ఎలా ఉన్నాడో అంటూ గర్వంగా చెప్పుకొచ్చింది. 

షారూఖ్ ఖాన్ కేవలం బాలీవుడ్ చిత్రాల ద్వారా మాత్రమే సంపాదించడం లేదు. అతనికి ఆదాయం విభిన్న వనరుల నుండి వస్తుంది..   షారుక్ ఖాన్ సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా. అతను చాలా స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టాడు. అతను ఐపీఎల్ జట్టు ‘కోల్‌కతా నైట్ రైడర్స్’ సహ యజమాని కూడా. అతను తన సొంత ప్రొడక్షన్ హౌస్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ని కూడా కలిగి ఉన్నాడు. 

షారుఖ్ ఖాన్  1988లో ప్రసారమైన 'ఫౌజీ' సీరియల్‌లో తొలిసారిగా నటించాడు. 1992లో విడుదలైన ‘దీవానా’ సినిమా ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ‘బాజీగర్‌’, ‘దుర్‌’, ‘డిడిఎల్‌జె’, ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’, ‘డాన్‌’, ‘డాన్‌ 2’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘పఠాన్‌’, జవాన్‌ వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు షారుఖ్ కు క్రేజ్ తెచ్చిపెట్టాయి.

 

షారుఖ్ ఖాన్ ఆస్తులు 6300 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. భారతదేశంలోని అత్యంత ధనవంతులైన హీరోలలో షారుఖ్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన సంవత్సరానికి 280 కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు.  సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్ అలాగే అనేక వ్యాపార సంస్థల నుండి డబ్బు సంపాదిస్తున్నాడు ఈ స్టార్ హీరో. 

 

షారుఖ్ ఖాన్ ఒక్కో సినిమాకు 100-150 కోట్లు సంపాదిస్తున్నాడు. అంతే కాదు కొన్ని సినిమాల లాభాల్లో కూడా వీరికి వాటా ఉంటుంది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో షారుఖ్ ఒకరు. తమ సినిమాకు మంచి బిజినెస్ చేస్తుందని నిర్మాతలు కూడా అడిగినంత చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు.

 

 షారుఖ్ ఖాన్ చాలా కంపెనీలకు అంబాసిడర్ గాను వ్యవహరిస్తున్నాడు. ఒక్కో బ్రాండ్ ప్రమోషన్‌కు దాదాపు పది కోట్ల వరకు అందుకుంటున్నాడు. అదే విధంగా షారూఖ్ ఖాన్ కు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ ఉంది.ఈ నిర్మాణ సంస్థ ద్వారా చాలా సినిమాలు నిర్మిస్తున్నారు. దీని ద్వారా షారుక్ ఖాన్ ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు.

 

 అలాగే షారుక్ ఖాన్ ఐపీఎల్ టీమ్ ‘కోల్‌కతా నైట్ రైడర్స్’ యజమాని. ఈ జట్టు విలువ 9,017 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. ఇక షారూఖ్ ఖాన్ దగ్గర లగ్జరీ కార్ కలెక్షన్ ఉంది. అతని వద్ద చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. అతని కార్ కలెక్షన్ ధర 31 కోట్ల రూపాయల కంటే ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది . అలాగే షారూఖ్‌కు విలాసవంతమైన వ్యానిటీ వ్యాన్ ఉంది. దీని ధర 4 కోట్ల రూపాయల కంటే ఎక్కువ.

2024-07-02T01:53:26Z dg43tfdfdgfd