నమ్రత పేరుపై వందలాది కోట్ల బిజినెస్ లు ఇవే ?..సరైన ప్లేస్ లో కాసులు కురిపించేలా మహేష్ బాబు కొత్త ఐడియా

సినిమాలు, వ్యాపారాలు, చారిటి కార్యక్రమాలు ఇలా అన్నింటిలో మహేష్, నమ్రత దంపతులు ది బెస్ట్ అనిపించుకుంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రాజమౌళి చిత్రంతో త్వరలో రంగంలోకి దిగబోతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు 29వ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని విధంగా ఈ చిత్రం కోసం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంతో మహేష్ బాబు రేంజ్ హాలీవుడ్ లెవల్ కి వెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

సినిమాల్లో మహేష్ బాబు తన 100 పర్సెంట్ ఇస్తాడు. మహేష్ బాబు ఇంటెన్స్ లుక్స్, చార్మ్ ఫ్యాన్స్ ని కట్టిపడేసే విధంగా ఉంటాయి. ఇక ఫ్యామిలీ విషయంలో కూడా మహేష్ బాబు ఎంతో కేరింగ్ గా ఉంటారు. ఆయన సతీమణి నమ్రత..మహేష్ కి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అనే చెప్పాలి. ఒకవైపు నమ్రత పిల్లల బాగోగులు చూసుకుంటూనే మరోవైపు మహేష్ బాబుకి సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాల్ని కూడా నడిపిస్తుందనే ప్రచారం ఉంది. 

సినిమాలు, వ్యాపారాలు, చారిటి కార్యక్రమాలు ఇలా అన్నింటిలో మహేష్, నమ్రత దంపతులు ది బెస్ట్ అనిపించుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం మహేష్ బాబు హైదరాబాద్ లో ఏషియన్ సినిమాస్ తో కలసి ఎంఏబి సినిమాస్ అనే మల్టి ఫ్లెక్స్ థియేటర్ ని ప్రారంభించారు. మహేష్ పై జరుగుతున్న బిజినెస్ కావడంతో అది కేవలం సినిమా థియేటర్ లాగా కాకుండా పాపులర్ విజిటింగ్ ప్లేస్ లాగా మారిపోయింది. ప్రస్తుతం ఏఎంబి సినిమాస్ వందల కోట్ల కాసులు కురిపిస్తునట్లు తెలుస్తోంది. 

ఈ సక్సెస్ ఫార్ములాని మహేష్ బాబు మరో నగరంలో అప్లై చేయబోతున్నారు. ఏఎంబి సినిమాస్ కొత్త బ్రాంచ్ ని బెంగుళూరు లో కూడా ప్రారంభిస్తున్నారు. బెంగళూరులో ఏఎంబి సినిమాస్ కి సంబంధించిన పూజా కార్యక్రమం తాజాగా జరిగింది. ఏఎంబి సినిమాస్ కి మహేష్ బాబు పేరు ఉన్నప్పటికీ ఆ ప్రాపర్టీ బిజినెస్ జరిగేది మాత్రం నమ్రత పేరుపై అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా బెంగుళూరులో మరో కొత్త బిజినెస్ ని మహేష్ దంపతులు ప్రారంభించబోతున్నారు. 

మహేష్ బాబు ఏషియన్ సంస్థ వారితో భాగస్వామ్యంలో ఉన్న బిజినెస్ ఇదొక్కటి మాత్రమే కాదు. బంజారా హిల్స్ లో ఏఎన్ ప్యాలెస్ హైట్స్ అనే హోటల్ కూడా ఉంది. ఈ హోటల్ కూడా నమ్రత పేరుపైనే ఉన్నట్లు టాక్. ఏఎన్ అంటే ఏషియన్ నమ్రత అని అంటున్నారు. 

ఇక మహేష్ బాబు దంపతులకు దుబాయ్ లో లగ్జరీ విల్లా ఉంది. అదే సమయంలో మహేష్ బాబు సినిమా నిర్మాణంలో కూడా రాణిస్తున్నారు. వాణిజ్య ప్రకటనల్లో కూడా సౌత్ లో మహేష్ బాబు టాప్ లో ఉన్నారు. కార్పొరేట్ సంస్థలకు మహేష్ బాబు అనే పేరు ఒక బ్రాండ్ గా మారిపోయింది. మహేష్ బాబు, నమ్రత ఇద్దరి వార్షిక ఆదాయం 400 కోట్ల వరకు ఉంటుందని టాక్. 

2024-04-25T01:41:23Z dg43tfdfdgfd