నవీన్ పొలిశెట్టికి ప్రమాదం.. రెండు నెలలు విశ్రాంతి

యంగ్ హీరో నవీన్ పొలిశెట్టికి అమెరికాలో ప్రమాదం జరిగిందనే వార్త నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతోంది. షూటింగ్‌లో భాగంగా ఈ ప్రమాదం జరిగిందా? అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఇదేమీ షూటింగ్‌లో భాగంగా జరిగినట్టుగా కనిపించడం లేదు. ఈ బైక్ ప్రమాదంలో నవీన్ చేతికి గాయాలయ్యాయట. చేతికి ఫ్యాక్చర్ అవ్వడంతో నవీన్ పొలిశెట్టి రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందట. అంటే నవీన్ పొలిశెట్టి సినిమాలు మరింతగా ఆలస్యం అయ్యేలా ఉన్నాయి.

నవీన్ పొలిశెట్టి థియేటర్లో నవ్వించి చాలా రోజులే అవుతోంది. చివరగా అనుష్క శెట్టితో కలిసి నవీన్ పొలిశెట్టి థియేటర్లోకి వచ్చాడు.మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఎంతో డీసెంట్‌గా ఉండటం, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి బాాగా నచ్చడంతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అటు అనుష్కకు, ఇటు నవీన్ పొలిశెట్టికి నటన పరంగానూ మంచి పేరు తెచ్చి పెట్టింది. జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలతో నవీన్ బాగానే క్రేజ్ దక్కించుకున్నాడు.

నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగానే ఉన్నాడు. త్వరలోనే మూవీ అప్డేట్‌లు ఇస్తానంటూ నవీన్ వేసిన ట్వీట్ బాగానే వైరల్ అయింది. జాతి రత్నాలు 2 కూడా ఉంటుందన్నాడు. అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నానని, త్వరలోనే అందరినీ నవ్వించేందుకు థియేటర్లోకి వస్తాను అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. కానీ ఇంతలోనే ఇలా బెడ్ రెస్ట్ తీసుకునే పరిస్థితికి నవీన్ పొలిశెట్టి వచ్చేశాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T06:35:07Z dg43tfdfdgfd