RAVISHA | ఏడాదికి రూ.88 లక్షల వేతనం.. వరంగల్‌ నిట్‌ విద్యార్థికి భారీ ప్యాకేజీ

  • 12 మంది విద్యార్థులకు రూ.68 లక్షలు
  • 1,128 మందికి ఉద్యోగ ఆఫర్లు

Ravisha | హనుమకొండ చౌరస్తా, జూలై 3: వరంగల్‌ నిట్‌ బీటెక్‌ ఈసీఈకి చెందిన విద్యార్థి రవిషాకు రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీ ఇచ్చి ఉద్యోగానికి ఎంపిక చేసుకున్నట్టు నిట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బిద్యాధర్‌ సుబుధి తెలిపారు. బుధవారం ఆయన ప్లేస్‌మెంట్స్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 2023-24 విద్యా సంవత్సరానికి వరంగల్‌ నిట్‌ బీటెక్‌ విద్యార్థులు 82 శాతం, ఎంటెక్‌, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏతో సహా మొత్తం 76 శాతం మంది ప్లేస్‌మెంట్‌ను సాధించారని తెలిపారు.

ఈ ఏడాది రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో ప్రైవేట్‌ రంగానికి చెందిన 250కి పైగా కంపెనీలు, 10 ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొన్నాయని, అర్హత సాధించిన 1,483 మంది విద్యార్థుల్లో 1,128 మంది విద్యార్థులు ఉద్యోగ ఆఫర్లను పొందారని చెప్పారు. బీటెక్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌(ఈసీఈ) విద్యార్థి రవిషా సంవత్సరానికి అత్యధికంగా రూ.88 లక్షల ప్యాకేజీని, మరో 12 మంది విద్యార్థులు రూ.68 లక్షల ప్యాకేజీని పొందారని తెలిపారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో పనిచేస్తున్న కంపెనీల నుంచి అత్యధిక ప్యాకేజీ ఆఫర్లు విద్యార్థులకు అందాయని, ఈ సంవత్సరం సగటు ప్యాకేజీ 15.6 లక్షలుగా ఉందని వివరించారు.

2024-07-03T20:11:21Z dg43tfdfdgfd