నిద్రలోనే తెల్లారిన బతుకులు

  • మట్టి మిద్దె కూలి నలుగురు మృతి చెందడంతో భాస్కరుడి జీవితంలో చీకట్లు
  • నాగర్‌కర్నూల్‌ జిల్లా వనపట్లలో విషాదం
  • వానకాలంలో కూలుతున్న పాత ఇండ్లు
  • ముందస్తు చర్యలు చేపట్టని సర్కారు

నాగర్‌కర్నూల్‌, జూలై 1 (నమస్తే తెలంగాణ) : అతడి పేరు భాస్కర్‌.. ప్రపంచానికి వెలు గునిచ్చే సూర్యుడి పేరున్న ఆ వ్యక్తి కుటుంబాన్ని వరుణుడు చీకటిమయం చేశాడు. నలుగురు కుటుంబసభ్యులను కోల్పోయిన ఒంటరి వాడ య్యాడు. నాగర్‌కర్నూల్‌ మండలం వనపట్లకు చెందిన భాస్కర్‌ కుటుంబం వరుణుడి ప్రకో పానికి బలి అయ్యింది. ఆదివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి భాస్కర్‌ తన భార్య, ముగ్గురు పిల్లలను కోల్పోయి ఒంటరిగా మిగిలి పోయాడు.

ఎవరి కోసం బతకాలి..

తన కుటుంబ పోషణ కోసమే రెక్కలు ముక్క లు చేసుకొని కష్టపడుతున్నానని, వాళ్లే లేకుంటే ఎవరి కోసం బతకాలని వనపట్లకు చెందిన ఆ టో డ్రైవర్‌ గొడుకు భాస్కర్‌ బోరున విలపిం చాడు. అతడికి ఎకరా పొలం ఉన్నా ఆటో నడు పుతూ ఉపాధి పొందుతున్నాడు. భార్య పద్మ మ్మ(28)తోపాటు కూతుళ్లు తేజశ్విని(7), వసంత(5), కొడుకు రిత్విక్‌(13 నెలలు)తో సంతోషంగా జీవిస్తున్న కుటుంబంలోకి మృత్యు వు తొంగి చూసింది. ఆదివారం రాత్రి భార్యా పిల్లలతో కలిసి భోజనం చేసి పడుకున్న వారి జీవితాలు నిద్రలోనే తెల్లారాయి. తమ జీవి తంలో ఇదే చీకటి రోజుగా మిగిలిపోతుందని భాస్కర్‌ గుర్తించలేకపోయాడు. అర్ధరాత్రి కురిసి న భారీ వర్షానికి మట్టితో కూడిన మిద్దె కూలి పోయింది. దీంతో కప్పుపై ఉన్న కట్టెలు, మట్టి భార్యాపిల్లలపై పడ్డాయి. దీంతో ఊపిరాడక తల్లి సహా ముగ్గురు పిల్లలు మృతి చెందారు. కాగా భాస్కర్‌ పక్కన ఫ్రిజ్‌ ఉండడంతో మట్టి, దూలా లు అతడి మీద పడక పోవడంతో స్వల్ప గాయా లతో బయటపడ్డాడు. పెద్ద శబ్దం రావడంతో పక్కనున్న ఇండ్లవాసులు వచ్చి సహాయక చర్య లు చేపట్టారు. అప్పటికే మట్టిలో కూరుకుపోయి నలుగురు ప్రాణాలు వదిలారు. మృతదేహాలను నాగర్‌కర్నూల్‌ జిల్లా దవాఖానకు తరలించారు. మంత్రి జూపల్లి సోమవారం ప్రకటనలో ది గ్భ్రాంతి వ్యక్తం చేశారు. మట్టిమిద్ద కూలి మృతి చెందిన బాధిత కుటుంబానికి ప్రగాఢ సాను భూతిని తెలియజేశారు. ప్రభుత్వం అండగా ఉం టుందని, గాయపడిన భాస్కర్‌కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదే శించారు. అలాగే ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి కూలిన ఇంటిని పరిశీలించి అనంతరం చికిత్స పొందు తున్న భాస్కర్‌ను పరామర్శించారు. ఆయన తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకు లు ధైర్యం నూరిపోశారు. ప్రభుత్వపరంగా ఆదు కుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చి తక్షణ సా యంగా రూ.20 వేలు అందజేశారు. కలెక్టర్‌ సం తోష్‌ అక్కడికి చేరుకొని భాస్కర్‌ను ఓదా ర్చారు. భార్యాపిల్లలు మృతి చెందడంతో భాస్క ర్‌ బో రున విలపించాడు. కుటుంబం కోసమే తాను రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడు తు న్నానని.. ఇప్పుడు ఎవరి కోసం బతకాలని అత డు ఆవేదన చెందాడు. కాగా ప్రభ్వు పరంగా మృతుల కుటుంబానికి రూ.4లక్షల ఎక్స్‌గ్రే షి యా అందించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

ముందస్తు చర్యలు నిల్‌

వనపట్లలో ఇల్లు కూలి నలుగురు మృతి చెందగా.. మేలో తాడూరు మండలం ఇంద్ర కల్‌లో వర్షానికి ఓ షెడ్డు కూలిన ఘటనలో పలు వురు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబా నికి చెందిన ముగ్గురితోపాటు మరొకరు మర ణించిన విషయం తెలిసిందే. ఇలా వానకా లంలో పలువురు ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ సమయంలో నాయకులు, అధికారులు పరా మర్శలకే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతులకు, బాధితులకు ప్రభుత్వం తరఫున కనీసం ఆర్థికసాయం కూడా అందడం లేదు. ప్రజాప్రతినిధులు పరిహారం అందిస్తామని ప్రకటనలకే పరిమితమవు తున్నా రు తప్పా.. ప్రభుత్వం తరఫున ముందస్తు చర్య లు తీసుకోవడం మాత్రం కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో శిథిలావ స్థకు చేరిన ఇండ్లు చాలా ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ హయాంలో పల్లె ప్రగతిలో భాగంగా శిథిలా వస్థకు చేరిన ఇండ్లను గుర్తించి కూలగొట్టారు. ప్రస్తుతం అలాంటి ఇండ్ల వివరాలను అధికారు లు మాత్రం సేకరించడం లేదు. దీంతో భవిష్య త్తులో మరిన్ని ప్రాణాలు పోయే అవకాశం ఉన్న ది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ప్రజలు కోరుతున్నారు.

2024-07-02T00:34:21Z dg43tfdfdgfd